జొహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరుదైన మూడో టెస్టు మ్యాచ్‌లో పరుగులు చేయడానికి భారత బ్యాట్స్‌మన్ చెమటోడ్చుతున్నారు. ఓపెనర్లు మురళీ విజయ్ 32 బంతుల్లో ఎనిమిది పరుగులు, లోకేష్ రాహుల్ డకౌట్‌లు వెంటనే వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ కోహ్లి, పుజారాలు భుజానికెత్తుకున్నారు.
విజయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తొలి పరుగు చేయడానికి 54 బంతులు తీసుకున్నాడు. లుంగీ ఎంగిడి వేసిన ఓవర్లో బంతిని స్క్వేర్ వైపు నెట్టిన పుజారా తొలి పరుగును నమోదు చేశాడు. క్రీజులోకి వచ్చిన 90 నిమిషాల తర్వాత ఒక్క పరుగు చేసిన పుజారాపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.
కాగా, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 24 పరుగులు, పుజారా 66 బంతుల్లో 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఫిలాండర్లకు చెరో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment