
రెండేళ్ల తర్వాత గంభీర్
ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో, చివరి టెస్ట్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ స్టార్ బ్యాట్స్మెన్ గౌతం గంభీర్ ఎదురు చూపులు ఈ మ్యాచ్తో ఎట్టకేలకు ఫలించాయి. ఇంగ్లండ్‌లో 2014లో చివరిసారి టెస్టు ఆడిన ఈ ఢిల్లీ స్టార్ రెండేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. గాయం కారణంగా ఓపెనర్ లోకేష్ రాహుల్ తప్పుకోవడంతో గంభీర్‌కు అవకాశం కల్పించారు. రెండేళ్ల తర్వాత తుదిజట్టులో స్థానం సంపాదించిన గంభీర్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు. పరుగులు రాబట్టే క్రమంలో 60 పరుగుల వద్ద గౌతం గంభీర్ 29 పరుగులు (రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు) చేసి ఔటయ్యాడు. 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పుజారా, కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు.
ఇప్పటికే తొలి రెండు టెస్టుల విజయంతో సిరిస్‌ను కైవసం చేసుకున్న టీం ఇండియా క్లీన్‌స్వీప్పై కన్నేస్తే, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సత్తా చాటాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, గప్టిల్, టేలర్, రోంచీ, సాన్‌ట్నర్, వాట్లింగ్, జిమ్మి నీషమ్, జీతన్, సోధి, బౌల్ట్.