సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్; 21 ఫోర్లు) కెరీర్‌లో 17వ టెస్టు సెంచరీ చేయడంతోపాటు 6 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఓవర్‌నైట్ స్కోరు 24/3తో మూడో రోజు ఆదివారం ఆట కొనసాగించిన పాక్‌ను ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్ (5/56), బ్రాడ్ (2/40) దెబ్బ తీశారు. అంతకుముందు రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment