పాకిస్తాన్ విజయం
ఇంగ్లండ్‌తో తొలి వన్డే
అబుదాబి: మొహమ్మద్ హఫీజ్ (130 బంతుల్లో 102; 10 ఫోర్లు; 1 సిక్స్) వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 6 వికెట్లతో నెగ్గింది. దీంతో నాలుగు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. నేడు (శుక్రవారం) రెండో మ్యాచ్ జరుగుతుంది. బుధవారం జరిగిన ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.4 ఓవర ్లలో 216 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇయాన్ మోర్గాన్ (96 బంతుల్లో 76; 11 ఫోర్లు), జేమ్స్ టేలర్ (82 బంతుల్లో 60; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఇర్ఫాన్, షోయబ్, అన్వర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యానికి బరిలోకి దిగిన పాక్ 43.4 ఓవర్లలో 4 వికెట్లకు 217 పరుగులు చేసి నెగ్గింది. అయితే 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో హఫీజ్ కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. టోప్లేకు మూడు వికెట్లు దక్కాయి.
హఫీజ్ సెంచరీ
Published Fri, Nov 13 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM
Advertisement
Advertisement