
వరుసగా రెండు టెస్టుల్లో ఎదురైన పరాజయాలను పట్టించుకోకుండా తమకు అండగా నిలవాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులను కోరుతున్నాడు. ‘కొన్నిసార్లు మనం గెలుస్తాం. కొన్నిసార్లు నేర్చుకుంటాం. అంతమాత్రాన మీరు మాపై నమ్మకం కోల్పోవద్దు.
ఇదే సమయంలో మిమ్మల్ని నిరాశపర్చమని మా తరఫున హామీ ఇస్తున్నా’ అని కోహ్లి తన అధికార ఫేస్‌బుక్ పేజీలో సందేశం ఉంచాడు. దీనికి ప్రాక్టీస్ సెషన్‌లో శ్రమిస్తున్న భారత జట్టు ఫొటోను జతచేశాడు.