![Kohli and other captains photo shoot Ahead of World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/24/Captiains-World-Cup.jpg.webp?itok=KB5Cxf-t)
లండన్: మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్‌కప్ రధసారథులు...ఆపై ఫొటోలకు పోజులిచ్చారు. పది జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది.
ఈ మెగా టోర్నీ ఈ నెల 30న ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్ 5న సౌతాంప్టాన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కాగా, శనివారం న్యూజిలాండ్‌తో జరుగునున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment