
మైదానంలో జడేజా డ్యాన్స్ .. ఎందుకో తెలుసా?
చండీగఢ్: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన కెరీర్‌లోనే బెస్ట్ టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. మొహాలీలో భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టులో 90 పరుగులు సాధించి జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజా వ్యక్తిగత అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.
లోయర్ ఆర్డర్‌లో వచ్చి ఓపికగా ఆడిన జడేజా 50 పరుగుల మైలురాయిని దాటగానే తనదైన స్టైల్‌లో మైదానంలో డ్యాన్స్ చేశాడు. తన బ్యాటును తల్వార్‌లా తిప్పుతూ కత్తి డ్యాన్స్ చేశాడు. మ్యాచ్ అనంతరం ఈ డ్యాన్స్ గురించి జడేజా స్పందిస్తూ రాజ్‌పుత్ కావడం వల్ల విజయాన్ని ఆస్వాదిస్తూ బ్యాటును కత్తిలా తిప్పాను. ఎందుకంటే నేను మైదానంలో కత్తిని తిప్పలేను కదా అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు లోయర్ ఆర్డర్ కూడా బాగా ఆడుతుండటం జట్టుకు బోనస్‌గా మారిందని పేర్కొన్నాడు.