ఇంగ్లండ్, శ్రీలంక మూడో టెస్టు ‘డ్రా’ | England and Sri Lanka draw third Test | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్, శ్రీలంక మూడో టెస్టు ‘డ్రా’

Published Tue, Jun 14 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

England and Sri Lanka draw third Test

లార్డ్స్: భారీ వర్షం కారణంగా చివరి రోజు 12.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో.... ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 32/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. కరుణరత్నే (37 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో సొంతం చేసుకుంది. గురు, శనివారాల్లో ఐర్లాండ్‌తో రెండు వన్డేల్లో తలపడే శ్రీలంక... అనంతరం ఇంగ్లండ్‌తో 21న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement