
లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరుగనున్న మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గతేడాది సెప్టెంబర్‌లో నైట్‌క్లబ్ వెలుపల తప్పతాగి ఒక వ్యక్తిని చితక బాదిన కేసును బ్రిస్టల్ క్రౌన్ కోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఈ క్రిమినల్ విచారణ అనం తరం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. దీంతో భారత్‌తో మిగతా సిరీస్‌కూ అతను దూరమ య్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది.
విచారణ సందర్భంగా ఆత్మరక్షణ కోసమే దాడి చేశానన్న క్రికెటర్ వ్యాఖ్యలు సత్యదూరమని న్యాయమూర్తి కొట్టిపారేసినట్లు తెలిసింది. తొలి టెస్టులో రాణించిన స్టోక్స్ నాలుగు కీలక వికెట్లు తీశాడు. అయితే రెండో టెస్టులో అతని స్థానంలో వచ్చిన వోక్స్ ఏకంగా మ్యాచ్‌నే గెలిపించే ప్రదర్శన ఇచ్చాడు. దీంతో స్టోక్స్ లేని లోటేమీ కనబడలేదు. మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో ఏ మార్పు చేయలేదు. గత మ్యాచ్ ఆడిన జట్టే బరిలోకి దిగుతుంది. మూడో టెస్టు ఈ నెల 18 నుంచి మొదలవుతుంది.