
IND Vs SA: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ, కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో వికెట్ కీపర్ ఎప్పటికీ విజయవంతమైన ఓపెనింగ్ బ్యాటర్ కాలేడని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అనవసరంగా వికెట్ కీపింగ్ రొంపిలోకి లాగొద్దని సూచించాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రాహుల్‌పై వికెట్ కీపింగ్ భారాన్ని మోపడం సబబు కాదని, ఇలా చేయడం వల్ల అతనితో పాటు జట్టు కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించాడు. క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కీపర్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణించింది లేదని ఈ సందర్భంగా ఉదహరించాడు.
కీపింగ్ చేసి ఓపెనర్‌గా సక్సెస్ కావడం వన్డే, టీ20ల్లో చూసామని, సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం అలా జరగడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ఉపఖండపు పిచ్‌లపై సగటున ఓ జట్టు 150 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే.. కీపింగ్ చేసి మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రాణించడం అత్యాశ అవుతుందని తెలిపాడు. పంత్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. మరో రెగ్యులర్ వికెట్ కీపర్ వైపు చూడాలి కాని, రాహుల్‌ను డిస్టర్బ్ చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
చదవండి: IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి, బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే..!