గంభీర్, అగార్కర్‌తో రోహిత్ (PC: BCCI)
కేఎల్ రాహుల్.. ఈ కర్ణాటక బ్యాటర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 వన్డేల్లో వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. సగటు 58.91తో మొత్తంగా 1355 పరుగులు సాధించాడు ఈ కుడిచేతివాటం బ్యాటర్. ఇందులో రెండు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. 48 స్టంపింగ్స్‌లోనూ భాగమయ్యాడు 32 ఏళ్ల కేఎల్ రాహుల్. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 75 వన్డేలు ఆడిన రాహుల్ ఖాతాలో 2820 పరుగులు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడే వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు.
సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరం
మరోవైపు.. రిషభ్ పంత్.. 26 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 30 వన్డేలు ఆడి 865 పరుగులు సాధించాడు. టెస్టులు(సగటు 43.67- 2271 రన్స్), టీ20(1209 రన్స్)లతో పోలిస్తే వన్డేల్లో ఈ ఉత్తరాఖండ్ ప్లేయర్ రికార్డు గొప్పగా ఏమీ లేదు. 2022 డిసెంబరులో ఘోర కారు ప్రమాదం తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు.
రీ ఎంట్రీలో అదుర్స్
ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నాటికి పునరాగమనం చేసిన రిషభ్ పంత్ కారణంగా.. వరల్డ్‌కప్ జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు కరువైంది. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వన్డే సిరీస్‌లో భాగంగా తుదిజట్టులో స్థానానికై వీరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
పంత్.. రాహుల్.. ఇద్దరిలో ఎవరు?
ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రాహుల్ వైపు మొగ్గుచూపుతారా.. లేదంటే పంత్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారా అన్న అంశం చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడగా.. ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్ కీపర్ బ్యాటర్లు రాహుల్- పంత్‌ల మధ్య ఒకరినే ఎంచుకోవాలంటే కష్టమే. ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. ఇద్దరు సమర్థులే. మ్యాచ్ విన్నర్లు కూడా!
హెడ్‌కోచ్‌తో చర్చిస్తాను
గతంలో ఎన్నోసార్లు ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. అలాంటివాళ్లలో ఒకరినే ఎంచుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటివి సమస్యలుగా పరిణమిస్తాయి. అయితే, ఒకందుకు ఇది కూడా మంచిదే. కెప్టెన్‌గా నాకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉండటం మంచి విషయమే.
రాహుల్- పంత్‌ల గురించి హెడ్‌కోచ్‌తో చర్చిస్తాను. మేము రేపు మ్యాచ్ ఆడేటపుడు మీకు ఈ విషయంపై స్పష్టత వస్తుంది. భారత క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఆడటం ముఖ్యం. ప్రయోగాలు సహజమే అయినా అందుకు ఓటమి రూపంలో మూల్యం చెల్లించాల్సి వస్తే మా ప్రయత్నం విరమించుకోవడమే ఉత్తమమని భావిస్తాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శుక్రవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగనుంది. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సిరీస్‌తోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టాడు. తాజాగా వన్డేల్లోనూ తన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యాడు.
చదవండి: వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment