wicket keeping
-
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు..
IND Vs SA: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ, కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపర్ ఎప్పటికీ విజయవంతమైన ఓపెనింగ్ బ్యాటర్ కాలేడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అనవసరంగా వికెట్ కీపింగ్ రొంపిలోకి లాగొద్దని సూచించాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రాహుల్‌పై వికెట్ కీపింగ్ భారాన్ని మోపడం సబబు కాదని, ఇలా చేయడం వల్ల అతనితో పాటు జట్టు కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించాడు. క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కీపర్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణించింది లేదని ఈ సందర్భంగా ఉదహరించాడు. కీపింగ్ చేసి ఓపెనర్‌గా సక్సెస్ కావడం వన్డే, టీ20ల్లో చూసామని, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం అలా జరగడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ఉపఖండపు పిచ్‌లపై సగటున ఓ జట్టు 150 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే.. కీపింగ్ చేసి మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రాణించడం అత్యాశ అవుతుందని తెలిపాడు. పంత్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. మరో రెగ్యులర్ వికెట్ కీపర్ వైపు చూడాలి కాని, రాహుల్‌ను డిస్టర్బ్ చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. చదవండి: IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి, బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే..! -
చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు కోచ్‌గా ఎవరో తెలుసా?
లండన్: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ఒక పురుషులు జట్టుకు వికెట్‌కీపింగ్ కోచ్‌గా ఎంపికైంది. ఇంగ్లండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా టేలర్ పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ససెక్స్‌కు వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేయనుండడం సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది. సారా టేలర్ ఇంగ్లండ్ తరపున 10 టెస్టుల్లో 300 పరుగులు, 126 వన్డేల్లో 4056 పరుగులు, 90 టీ20ల్లో 2177 పరుగులు సాధించింది. ఇక వికెట్‌కీపర్ మూడు ఫార్మాట్లు కలిపి 104 స్టంపింగ్స్.. 128 క్యాచ్‌లు అందుకుంది. ఇంగ్లండ్ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలవడంలో సారా టేలర్ కీలకపాత్ర పోషించింది. 2019లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. చదవండి: కరోనా కలకలం.. బీసీసీఐ కీలక నిర్ణయం -
ధోనిపై ఒత్తిడి ఎంత ఉందో అప్పుడే తెలిసింది
ఢిల్లీ : ఒకవైపు కెప్టెన్‌గా పనిచేస్తూనే మరొకవైపు వికెట్ కీపింగ్ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడమనేది ఎంత కష్టంగా ఉంటుందో తాను స్వయంగా చూశానంటూ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానంలో కోహ్లి ఒక ఓవర్ పాటు వికెట్ కీపర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ కూడా సెట్ చేశాడు. అయితే వికెట్ కీపింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై కూడా ఫోకస్ పెట్టడం ఎంత కష్టమో అప్పుడు తెలిసొచ్చిందంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. మయాంక్ అగర్వాల్ నిర్వహిస్తున్న ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ చాట్‌షోలో పాల్గొన్న కోహ్లి ఆరోజు మ్యాచ్‌లో జరిగిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (బ్రాడ్‌ను మనస్పూర్తిగా అభినందించండి: యూవీ) 'బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో 44వ ఓవర్లో ధోని నా దగ్గరకు వచ్చాడు. తాను రెస్ట్ రూమ్‌కు వెళ్తానని రెండు- మూడు ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాలని చెప్పాడు. మా జట్టుకు నాయకత్వ స్థానంలో ఉన్న ధోని మాటను అంగీకరించి కీపింగ్ బాధ్యతలు చేపట్టాను. 44వ ఓవర్లో బయటకు వెళ్లిన ధోని 45వ ఓవర్ పూర్తి కాగానే తిరిగి వచ్చాడు. కానీ నేను కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ఆ ఒక్క ఓవర్ నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఒకవైపు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్‌తో పాటు బౌలర్ వేస్తున్న బంతిని గమనించాలి. నిజంగా ఇది చాలా కష్టం. అప్పడు అర్థమయింది.. వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎంత కష్టంగా ఉంటాయో.. పైగా ధోని కెప్టెన్‌గా ఉండడంతో అటు కీపింగ్ చేస్తూనే ఫీల్డింగ్‌పై కూడా ఫోకస్ పెట్టేవాడు.'అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. (21 ఏళ్లు క్రికెట్‌ను మోశాడు.. అందుకే ఎత్తుకున్నాం) -
బ్యాటింగే కాదు కీపింగ్‌లోనూ.. ప్చ్!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ ప్రపంచకప్‌లో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ధోని.. వికెట్ కీపింగ్ విషయంలోనూ అనుమానాలకు తావిస్తున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ.. అద్భుతంగా కీపింగ్ చేయడమే కాదు.. వికెట్లకు సంబంధించి డీఆర్ఎస్ సమీక్ష చేయడంలోనూ ఇప్పటివరకు ధోనీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే, కీలకమైన వరల్డ్ కప్‌లో మాత్రం ధోని వికెట్ కీపింగ్‌లోనే కాదు.. డీఆర్ఎస్ సమీక్షల్లోనూ అంచనాలు తప్పుతున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో జేసన్ రాయ్ గ్లోవ్‌ను తాకుతూ బంతి వెళ్లింది. ఐనా డీఆర్ఎస్ సమీక్ష తీసుకునే విషయంలో కోహ్లి.. ధోనిని సంప్రదించినా.. ధోని మాత్రం అందుకు విముఖత చూపాడు. అయితే, రీప్లేలో మాత్రం బంతిని జేసన్ రాయ్ గ్లోవ్‌ను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ధోని వికెట్ కీపింగ్ నైపుణ్యం మీదనే కాకుండా.. అతని నిర్ణయాలపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు స్టంపింగ్స్ మాత్రమే చేసిన ధోని.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన జాబితాలో అట్టడుగున చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకి చెందిన అలెక్స్ క్యారీ 18 స్టంపింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అప్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 28 పరుగులు చేసిన ధోనిపై సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా అతని ఆటతీరును విమర్శించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇన్నింగ్స్‌లో భాగంగా స్పిన్ బౌలింగ్, స్లో బాల్స్‌ను ఎదుర్కోలేక చతికిలపడిన ధోని పరోక్షంగా జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన ధోని కేవలం 188 పరుగులే చేయడం అతని బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. ఇప్పటికే 37 ఏళ్లు పూర్తి చేసుకున్న ధోని తన ఆటతో జట్టుకు ఉపయోగపడాల్సింది పోయి భారంగా మారాడని క్రికెట్ ప్రేమికులు అసహనం వ్యక్తం చేశారు. -
అవకాశం 'జారవిడిచాడు'
ధోనివల్ల భారత్‌లో వికెట్ కీపింగ్ కెరీర్‌గా ఎంచుకున్నవాళ్లందరికీ నిరాశే.... కొంతకాలం క్రితం వినిపించిన వ్యాఖ్య ఇది. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా, ఆ తర్వాత కెప్టెన్‌గా జట్టులో ధోని స్థానం సుస్థిరమైంది. దీంతో దేశంలో మిగిలిన కీపర్లంతా నిరాశ చెందారు. కానీ ధోని లేని సమయంలో వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకోలేకపోయారు. తాజాగా ఆసియా కప్‌లో దినేశ్ కార్తీక్ కూడా ధోనిని మరిపించలేకపోయాడు. ఏకంగా రెండు మ్యాచ్‌ల్లో సులభమైన స్టంపింగ్ అవకాశాలను వదిలేసి భారత్ ఆసియాకప్ ఫైనల్ ఆశలను క్లిష్టం చేశాడు. క్రీడావిభాగం గత ఐదేళ్లలో ధోని జట్టులో లేకుండా భారత్ ఆడిన మ్యాచ్‌లను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. ఎప్పుడైనా కెప్టెన్ అందుబాటులో లేకపోతే సాహా, పార్థీవ్, కార్తీక్‌లలో ఒకరు జట్టులోకి రావాలి. ఇలాంటి స్థితిలో దినేశ్ కార్తీక్‌కు మిగిలిన వాళ్లకంటే ఎక్కువగానే అవకాశాలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ధోని జట్టులో ఉన్నా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కూడా కార్తీక్‌ను ఆడించారు. కానీ ప్రస్తుత ఆసియాకప్‌లో అతడి ఆట చూస్తుంటే... అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ రాణించలేక రెంటికి చెడినట్లుగా కనిపిస్తున్నాడు. అరుదుగా వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వరుసగా విఫలమవుతున్నాడు. ఇక మరో చెత్త ప్రదర్శనతో కార్తీక్ కెరీర్ కూడా ప్రమాదంలో పడవచ్చు. సునాయాస అవకాశాలు... శ్రీలంకతో మ్యాచ్‌లో సంగక్కరను 30 పరుగుల వద్ద స్టంప్ చేయడంలో కార్తీక్ విఫలమయ్యాడు. ఫలితంగా సంగ సెంచరీతో జట్టును గెలిపించాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో చెత్త షాట్ ఆడి నిష్ర్కమించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కీలక దశలో మఖ్సూద్ను స్టంప్ చేసే సునాయాస అవకాశాన్ని కార్తీక్ జారవిడిచాడు. ఆ తర్వాత హఫీజ్‌తో కలిసి అతను మరికొన్ని పరుగులు జోడించడం ఫలితంపై ప్రభావం చూపింది. ఇక బ్యాటింగ్‌లోనే భారత్ స్కోరు 103/4గా ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన అతను భారీ భాగస్వామ్యం అవసరమైన దశలో బాధ్యతారహిత షాట్ ఆడి వెనుదిరిగాడు. ఈ రెండు ప్రదర్శనలు దినేశ్ కార్తీక్ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. స్టార్ క్రికెటర్ ధోని లేని సమయంలో మరింత బాగా కీపింగ్ చేయాల్సిన, బ్యాటింగ్‌లో రాణించాల్సిన కార్తీక్ చేజేతులా ఈ అవకాశాలు పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అద్భుతమైన స్ప్రింట్ లక్షణాలతో కీపింగ్ చేసిన దినేశ్, ఇప్పుడు సాధారణంగా మారిపోయాడు. అన్నింటికి మించి జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయలేకపోవడం ఆసియా కప్‌లో భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. జట్టులో అనుభవజ్ఞుడే... ఆసియా కప్‌లో ఆడుతున్న భారత జట్టులో చాలా మందితో పోలిస్తే దినేశ్ కార్తీక్‌కు మంచి అనుభవం ఉంది. దాదాపు పదేళ్ల క్రితమే అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. కెరీర్లో 70 వన్డేలు, 23 టెస్టులు ఆడాడు. ధోని సమకాలికుడు కావడం కార్తీక్‌కు ప్రతికూలంగా పరిణమించినా, చాలా అవకాశాలు అతనికి దక్కాయి. సెలక్టర్లు కూడా అతని ప్రతిభకు తగిన గుర్తింపునిచ్చారు. తన కెరీర్లో అతను 42 వన్డేలు, 7 టెస్టుల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా భారత్ తరఫున బరిలోకి దిగాడు. 42 మ్యాచుల్లో అతను టాప్-5 స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాడు. అందులోనూ 20 సార్లు ఓపెనింగ్ చేసే అవకాశం దక్కింది. అయినా సరే కార్తీక్ పెద్దగా పురోగతి సాధించలేకపోయాడు. ఇన్ని అవకాలు దక్కినా అతని సగటు 27. 48 మాత్రమే. స్ట్రైక్ రేట్ (73.15) కూడా ఘనంగా ఏమీ లేదు. మళ్లీ చోటుందా... సెప్టెంబర్ 2009 నుంచి ఆగస్టు 2010 వరకు 17 ఇన్నింగ్స్‌లలో కార్తీక్ కేవలం రెండు అర్ధ సెంచరీలే చేశాడు. వరుసగా మూడు మ్యాచుల్లో 9, 0, 0 పరుగులు చేయడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దాదాపు మూడేళ్లు అతను టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అయితే 2012-13 రంజీ సీజన్‌తో పాటు ఐపీఎల్లో బాగా ఆడటంతో అతనికి చాంపియన్స్ ట్రోఫీకి పిలుపు లభించింది. యువరాజ్ స్థానంలో ఆడుతూ వార్మప్ మ్యాచ్‌లలో సెంచరీలు చేసినా...15 వన్డేల్లో రెండే అర్ధ సెంచరీలు చేయడంతో మళ్లీ స్థానం కోల్పోయాడు. ధోని గాయంతో అదృష్టవశాత్తూ చోటు దక్కినా ఆకట్టుకోలేకపోయాడు. మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తనదైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లోనూ అతను జట్టుతో పాటు పర్యటించాడు. అయితే అతనికి దక్కని అదృష్టం కార్తీక్‌కు లభించింది. కానీ కార్తీక్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. భారత్ తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడిన సాహాకు దేశవాళీలో మంచి రికార్డు ఉంది. ఈ రంజీ సీజన్లో అతను 6 మ్యాచుల్లో 65.77 సగటుతో 592 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అద్భుతంగా రాణిస్తేనే కార్తీక్‌కు టీమిండియాలో చోటు లభిస్తుంది.