లండన్: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ఒక పురుషులు జట్టుకు వికెట్‌కీపింగ్ కోచ్‌గా ఎంపికైంది. ఇంగ్లండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా టేలర్ పేరు పొందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ససెక్స్‌కు వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేయనుండడం సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది.
సారా టేలర్ ఇంగ్లండ్ తరపున 10 టెస్టుల్లో 300 పరుగులు, 126 వన్డేల్లో 4056 పరుగులు, 90 టీ20ల్లో 2177 పరుగులు సాధించింది. ఇక వికెట్‌కీపర్ మూడు ఫార్మాట్లు కలిపి 104 స్టంపింగ్స్.. 128 క్యాచ్‌లు అందుకుంది. ఇంగ్లండ్ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలవడంలో సారా టేలర్ కీలకపాత్ర పోషించింది. 2019లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది.
చదవండి:
కరోనా కలకలం.. బీసీసీఐ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment