woman cricketer
-
వెన్ను విరిగినా వెన్నుదన్నుగా... ‘సోల్ ఫ్రీ’ ప్రీతి స్ఫూర్తిదాయక జర్నీ
క్రికెటర్‌గా తమిళనాడు రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండే ప్రీతి శ్రీనివాసన్‌కు 18 ఏళ్ల వయసులో వెన్నుకు పక్షవాతం వచ్చి, వీల్ చెయిర్‌కే పరిమితం అయ్యింది. తనను తాను మెరుగుపరుచుకుంటూ సోల్‌ఫ్రీ ఫౌండేషన్ ద్వారా స్పైనల్‌కార్డ్ సమస్యలతో బాధపడే 2,500 మందికి వెన్నుదన్నుగా నిలిచింది. సోషియాలజీలో పీహెచ్డీ చేస్తూ, సైకాలజీలో రాణిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. జీవితంలో ఏదైనా కారణం చేత పడిపోయినప్పుడు తిరిగి నిలబడే శక్తిని పెంచుకోవాలనే స్ఫూర్తిని నింపుతోంది ప్రీతి జీవనం. ‘‘అథ్లెట్‌గా నాది అద్భుతమైన జీవితం. చెన్నైలో పుట్టి మూడు ఖండాల్లో పెరిగిన నేను జాతీయ స్థాయి స్విమ్మర్ స్థాయికి చేరుకున్నాను. మూడేళ్ల వయసు నుంచే స్విమ్మింగ్ ప్రారంభించాను. నాలుగేళ్ల వయసులో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాను. ఎనిమిదేళ్ల వయసులో తమిళనాడు అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. చదువులోనూ ముందంజలో ఉండేదాన్ని. ప్రతిదీ విజయాల బాటగా జీవితం వెళ్లిపోతుంది. వైఫల్యం నీడ కూడా నా జీవితాన్ని తాకలేదు అనుకున్నాను. కానీ, 18 ఏళ్లు వచ్చేసరికి రెప్పపాటులో అంతా మారిపోయింది. బీచ్‌లో జరిగిన ప్రమాదం.. పుదుచ్చేరి బీచ్‌లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో నీటిలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కిందపడిపోయాను. వెన్నెముకకు గాయం కావడంతో మెడ కింది భాగం అంతా కదలిక కోల్పోయింది. అమ్మానాన్నల ప్రేమ, వారి సపోర్ట్‌తో నన్ను నేను మరో మార్గంలో వెతుక్కోవడం మొదలుపెట్టాను. వందలాది మందికి రెక్కలు వెన్నుపాము సమస్యలు ఉన్నవారికి పూర్తి చికిత్స, పునరావాసం, వైద్య సంరక్షణ, విద్య, కౌన్సెలింగ్, ఉపాధి అవకాశాలను అందించడానికి ‘సోల్‌ఫ్రీ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. ఈ సంస్థ తిరువణ్ణామలైలో 20 వేల అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న 200 మందికి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి కావల్సిన వసతి సదుపాయాలను అందిస్తోంది. సోల్ ఫ్రీలో ఇప్పటి వరకు 2,500 మంది ఆశ్రయం పొందారు. అడుగడుగునా అవరోధాలే.. ఇప్పుడు నా వయసు 42. కానీ, పద్దెనిమిదేళ్ల వయసులో జరిగిన సంఘటనతో నా గుండె ఆగి΄ోయినట్టు అనిపించింది. అప్పటి వరకు ఉన్న నా విశేషమైన ఉనికి ఒక్కసారిగా ΄ాతాళానికి పడి΄ోయినట్టుగా అనిపించింది. అమెరికాలో చదువుకుంటున్న టాప్ స్టూడెంట్స్‌లో నేనూ ఒకదాన్ని. పెద్ద పెద్ద క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాను. ఫిట్‌గా, అందంగా ఉండేదాన్ని. వేగంగా బంతిని విసిరే సామర్థ్యం ఉన్న నేను చిటికెన వేలును కూడా కదపలేని స్థితికి చేరుకున్నాను. అన్ని విధాలుగా అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన నేను అకస్మాత్తుగా నాకు నేను ఆహారం తీసుకోలేని... స్నానం చేయలేని... మంచం నుండి లేవలేని స్థితికి వెళ్లి΄ోయాను. అమ్మనాన్నలు నన్ను చూసుకోవడానికి వాళ్ల ఉద్యోగాల్ని విడిచిపెట్టారు. వైద్యం కోసం పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కాస్త కోలుకున్న తర్వాత బీఎస్సీ సైకాలజీలో చేరడానికి వెళితే, ఇప్పుడు నీకు ఈ చదువు అవసరమా అన్నట్టు ప్రవర్తించిన అక్కడి యాజమాన్య తీరు నన్ను కన్నీరు పెట్టించింది. కానీ, నాన్న నన్ను ్ర΄ోత్సహించారు. ఇంటి దగ్గరే ఉండి డిగ్రీ చదువుకునేలా స్ఫూర్తి నింపారు. ఫిక్షన్ స్టోరీస్, డిగ్రీ బుక్స్ మాత్రమే కాదు ఆధ్యాత్మిక పుస్తకాల వరకు అన్నీ చదివి వినిపించేవారు. నా నొప్పిని అధిగమించడానికి నాన్న నాకు ఎంతో సహాయపడ్డారు. కానీ, నాన్న గుండె΄ోటుతో మరణించడం ద్వారా విధి నన్ను మరోసారి బలంగా దెబ్బతీసింది. నాలుగు రోజుల తేడాతో అమ్మకూ గుండె΄ోటు వచ్చి, బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. నా ప్రపంచం మళ్ళీ శూన్యం అయ్యింది. 80 ఏళ్ల అమ్మమ్మ నన్ను చూసుకునేది. కానీ, ఆమె అమ్మ కోసం చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. నాకు తినిపించడం, కూర్చోబెట్టడం ఎవరు చేస్తారో తెలియదు. డబ్బు సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చింది. జీవితం మళ్లీ కష్టంగా అనిపించింది. అమ్మ, అమ్మమ్మల ఆరోగ్యం సమస్యాత్మకంగానే ఉండేది. ఈ సమయంలో మా ఫ్రెండ్స్ చదువును కంటిన్యూ చేయమన్నారు. బిఎస్సీ సోషియాలజీ తర్వాత సైకాలజీలో ఎంఎస్సీ కూడా పూర్తిచేశాను. సంరక్షణకు స్థలం దేశంలో దివ్యాంగులకు గౌరవంగా జీవించగలిగిన స్థలం ఎక్కడుంది అంటూ చాలా శోధించాను. కానీ, ఎక్కడా అలాంటి పునరావాస కేంద్రాలు, స్థలాలు లేవని తెలిసింది. దీంతో తీవ్ర వైకల్యాలున్న వ్యక్తులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఓ స్వర్గధామాన్ని నేనే ప్రారంభించాలనుకున్నాను. లాభాపేక్ష లేని సంస్థను నడపడం లేదా ఎవరినుంచైనా ఫండింగ్ తీసుకోవడం అనే ఆలోచన కూడా చేయలేదు. దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాను. సోల్ ఫ్రీ పేరుతో సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇక్కడ వారు తమకు ఇష్టమైన వ్యాపకాల్లో ఆర్నెల్లపాటు శిక్షణనూ పొందుతారు. దీనిని రీ –ఇంజనీరింగ్ అని పిలుస్తున్నాం. మేమందరమూ జీవించాలనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని పునరుద్ధరించాను. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు వాళ్ల ఇంటికి వెళ్లి డబ్బు సం΄ాదించాలన్నది లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంరక్షణను ఉచితంగా అందిస్తున్నాం. మాకు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, హైడ్రోథెరపీ, స్పోర్ట్స్, కౌన్సెలింగ్ సెషన్లు, ట్రైనింగ్ సెషన్లు, టైలరింగ్, కంప్యూటర్ క్లాసులు.. ఉన్నాయి. ఇది నా అనుభవపూర్వకమైన ఫ్రేమ్ వర్క్ నుండి పుట్టిన సంపూర్ణ వ్యవస్థ. ఇక్కడ వెన్నెముకకు అయ్యే గాయాలపై అవగాహన కల్పిస్తాం. మంచాన పడి ఉన్నప్పుడు నా జీవితాన్నీ ముగించుకోవాలనుకున్నాను. కానీ, ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి దివ్యాంగుల పునరావాసం కోసం కృషి చేస్తున్నాను. వికలాంగుల సంక్షేమ సలహా మండలి సభ్యురాలిగా ఉన్నాను. నా లాంటివారిపై జాలిపడే బదులు సవాల్‌తో అవకాశాలను ఉపయోగించుకోవాని అర్థం చేసుకున్నాను. ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నప్పుడు ప్రత్యేక సవాళ్లే వస్తాయి. ప్రతిదాంట్లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు. వచ్చిన సవాళ్లను అధిగమించడమే గొప్ప. ప్రపంచం నా ముందున్న తలుపులన్నీ మూసివేసింది. కానీ, కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాను. సృష్టించాను. ఇప్పుడు పీహెచ్డీ చేస్తూ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తూ నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను’ అని వివరిస్తుంది ప్రీతి శ్రీనివాసన్. -
Asian Games 2023: 'ఆసియా గేమ్స్ నుంచి తప్పుకొంటున్నా’
పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఆడనున్న పాక్ జట్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. టోర్నీకి పిల్లలను అనుమతించకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిస్మాహ్ మరూఫ్ తెలిపింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రికెటర్లు తమ పిల్లల్ని వెంట తీసుకురావొద్దని ఆసియా గేమ్స్ నిర్వాహకులు నిబంధన పెట్టారు. దీంతో రెండేళ్ల చంటిబిడ్డను వదిలి వెళ్లడం ఇష్టం లేని మరూఫ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక బిస్మాహ్ పాక్ ప్రధాన బ్యాటర్లలో ఒకరు. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆమె పాక్ తరపున 108 వన్డేల్లో 2602 పరుగులతో పాటు 44 వికెట్లు, 108 టి20ల్లో 2202 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది. 2021 ఏప్రిల్‌లో బిస్మాహ్ బిడ్డకు జన్మనివ్వడం కోసం క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్లో మైదానంలో అడుగుపెట్టింది. 2022లో బిస్మాహ్ పరుగుల వరద పారించింది. పాక్ మహిళల జట్టు తరఫున ఆ ఏడాది వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు కొట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఒక్క సెంచరీ లేకుండానే వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. ''దురృష్టవశాత్తూ పాక్ జట్టు బిస్మాహ్ మరుఫే సేవల్ని కోల్పోనుంది. పిల్లల్ని వెంట తీసుకురావొద్దనే నియమం కారణంగా ఆమె తన చిన్న పాపతో చైనాకు రాలేని పరిస్థితి'' అని మహిళల జట్టు హెడ్ తానియా మల్లిక్ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. హ్యాట్రిక్ కొట్టేనా..? ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్ జట్టుకు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సార్లు పాక్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. 2010లో చైనాలోని ఇంచియాన్‌లో, 2014లో దక్షిణ కొరియాలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచింది. దాంతో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. చదవండి: వైరల్‌గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే? తమిళ సంప్రదాయ పద్ధతిలో ఆసీస్ ఆల్‌రౌండర్ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం..
భారత మహిళా క్రికెటర్ మిన్ను మణికి కేరళలోని మనంతవాడి మున్సిపాలిటీ అరుదైన గౌరవం ఇచ్చింది. వయనాడ్ జిల్లాలోని ఈ మున్సిపాలిటీలో ఉన్న మైసూరు రోడ్డు జంక్షన్ పేరును మిన్ను మణి జంక్షన్ గా మార్చేసింది. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల మిన్ను చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. జులై 9న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20తో మిన్ను మణి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్ షమీమా సుల్తానాను తొలి వికెట్‌గా దక్కించుకుంది.తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది. సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడు టీ20ల్లో కేవలం 11.6 సగటుతో 5 వికెట్లు తీసింది. కాగా ఈ నెల 14న ప్రత్యేకంగా సమావేశమైన మనంతవాడి మున్సిపల్ కౌన్సిల్.. మైసూరు రోడ్డు జంక్షన్ ను మిన్ను మణి జంక్షన్ గా మార్చాలని నిర్ణయించారు. మిన్నును ఎలా గౌరవించాలా అని ఆలోచించే క్రమంలో ఇలా రోడ్డు జంక్షన్ కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మనంతవాడి మున్సిపల్ ఛైర్ పర్సన్ రత్నవల్లి చెప్పారు. మనంతవాడిలో మిన్ను ఇంటికి మంచి రోడ్డు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఓఆర్ కేలు చెప్పారు. మున్సిపల్ రోడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో ఆమె ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె ఇంటికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఈ సందర్భంగా కేలు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మిన్నును సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం కూడా మనంతవాడి మున్సిపాలిటీ అధికారులు చేపట్టారు. చదవండి: కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి -
సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ మాజీ క్రికెటర్.. లీసాకు అరుదైన గౌరవం!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్కు అరుదైన గౌరవం దక్కింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(ఎఫ్ఐసీఏ) అధ్యక్ష పదవి దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య అధ్యక్షురాలిగా ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని నియాన్ వేదికగా జరిగిన ఎఫ్ఐసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ విక్రమ్ సోలంకి స్థానాన్ని లీసా స్తాలేకర్ భర్తీ చేయనున్నారు. ఇక గతంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ బ్యారీ రిచర్డ్స్, వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ జిమ్మీ ఆడమ్స్ ఈ పదవిని చేపట్టారు. తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన లీసా.. తనకు దక్కిన గొప్ప గౌరవం ఇది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గ్లోబల్ గేమ్ క్రికెట్లో నూతన దశ ఆరంభమైందని, ఇక్కడ పురుషులు, మహిళలు అనే అసమానతలకు తావు లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కాగా 1998లో స్థాపించబడిన ఎఫ్ఐసీఏ అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాతినిథ్యం వహిస్తూ వారికి సంబంధించిన పలు అంశాల్లో గళం వినిపిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ ప్లేయింగ్ కమిటీలో ఈ సమాఖ్య ప్రతినిధి ఉంటారు. అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా లీసా స్తాలేకర్ ఆస్ట్రేలియా తరఫున 187 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో ఆసీస్ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా పేరొంది తద్వారా 2007, 2008లో బెలిండా క్లార్క్ అవార్డు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్‌కప్-2010 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. చదవండి: BCCI- IPL: కచ్చితంగా.. భారత్ ఏం చెబితే అదే జరుగుతుంది.. ఎందుకంటే: ఆఫ్రిది -
క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను..
సాక్షి, హిమాయత్‌నగర్: క్రికెట్ టోర్నీల్లో చాన్స్ ఇస్తామంటూ తనని ఓ వ్యక్తి మోసం చేశాడని మహిళా క్రికెటర్ ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీన క్రికెటర్ ఓ వ్యక్తి వాట్సప్ కాల్ చేశాడు. మీరు చాలా బాగా క్రికెట్ ఆడతారని, మీ ఆట గురించి కొందరి కోచ్‌ల నుంచి సమాచారం తెలుసుకుని కాంటాక్టు అయ్యానన్నాడు. స్టేట్ లెవెల్, ఇంటర్ స్టేట్ లెవెల్ లీగ్‌లో చాన్స్ ఇస్తామని, కొంత ఖర్చు అవుతుందని మాయ మాటలు చెప్పి దఫాలుగా రూ.1లక్షా 25వేలు కాజేశారు. మూడు నెలల్లో ఒక్క మ్యాచ్‌కు చాన్స్ ఇవ్వకపోగా మరిన్ని డబ్బులు కావాలంటూ వేధిస్తున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. -
చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు కోచ్‌గా ఎవరో తెలుసా?
లండన్: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ఒక పురుషులు జట్టుకు వికెట్‌కీపింగ్ కోచ్‌గా ఎంపికైంది. ఇంగ్లండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా టేలర్ పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ససెక్స్‌కు వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేయనుండడం సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది. సారా టేలర్ ఇంగ్లండ్ తరపున 10 టెస్టుల్లో 300 పరుగులు, 126 వన్డేల్లో 4056 పరుగులు, 90 టీ20ల్లో 2177 పరుగులు సాధించింది. ఇక వికెట్‌కీపర్ మూడు ఫార్మాట్లు కలిపి 104 స్టంపింగ్స్.. 128 క్యాచ్‌లు అందుకుంది. ఇంగ్లండ్ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలవడంలో సారా టేలర్ కీలకపాత్ర పోషించింది. 2019లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. చదవండి: కరోనా కలకలం.. బీసీసీఐ కీలక నిర్ణయం -
క్రికెటర్ వెడ్డింగ్ ఫోటోషూట్ : నెటిజన్లు ఫిదా
ఢాకా : ఇటీవలి కాలంలో ఒక ఫ్యాషన్ గా మారిపోయిన వెడ్డింగ్ ఫోటోషూట్ లు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. నిన్నగాక మొన్న కేరళ జంట ఈ విషయంలో కొత్త అలజడి సృష్టించింది. తాజాగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ (24) ఫోటోషూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చీర కట్టుతో, ఒంటినిండా నగలతో గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తూ చేసిన వెడ్డింగ్ షూట్ విశేషంగా నిలిచింది. అంతేకాదు ఈ ఫోటోలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టిని కూడా ఆకర్షించాయి. ఆభరణాలు, క్రికెటర్ బ్యాట్. క్రికెటర్లకు వివాహ ఫోటోషూట్లు ఇలా ఉంటాయి అంటూ ఐసీసీ ఈ ఫోటోలను రీట్వీట్ చేయడం మరో విశేషం. సంజిదా ఇస్లాం, ఇటీవల(అక్టోబర్ 17న) రంగాపూర్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్‌డీక్‌ను పెళ్లాడారు. ఈ సందర్బంగా క్రికెట్ పై పిచ్చి ప్రేమతో ఆ క్రికెట్ థీమ్‌తోనే వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. పెళ్లికూతురు ముస్తాబులోనే బ్యాట్ పట్టి కవర్ డ్రైవ్, పుల్ షాట్స్ ఫోజులతో అదరగొట్టారు. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోలపై లక్షలాదిమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే చాలామంది పాజిటివ్ గా స్పందించినట్టే.. ఎప్పటిలాగానే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అయితే వీటన్నింటినీ సంజిదా లైట్ తీసుకున్నారు. కాగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎనిమిదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంజిదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ విమెన్ గా రాణిస్తున్నారు. Dress ✅ Jewellery ✅ Cricket bat ✅ Wedding photoshoots for cricketers be like ... 👌 📸 🇧🇩 Sanjida Islam pic.twitter.com/57NSY6vRgU — ICC (@ICC) October 21, 2020 -
అంజలికి ప్రమోషన్
కర్నూలు, ఆదోని: పట్టణానికి చెందిన మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి సత్తా చాటుతోంది. నిలకడగా రాణిస్తూ ఇండియా–బీ మహిళల జట్టులో చోటు సంపాదించింది. ఈ మేరకు సోమవారం రాత్రి బీసీసీఐ నుంచి సమాచారం అందిందని అంజలి తండ్రి బీవీ రమణ తెలిపారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు పుదుచ్చేరిలో టీ–20 మహిళా ఛాలెంజర్స్ ట్రోఫీ అండర్ –23 క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో అండర్–23 ఇండియా–బీ జట్టుకు అంజలితో పాటు కోడుమూరుకు చెందిన ఎన్.అనూష కూడా ప్రాతినిథ్యం వహించారు. ఈ టోర్నీలో అంజలి బాగా రాణించడంతో ఇండియా–బీ సీనియర్స్ జట్టుకు ఎంపిక చేశారు. జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు టీ–20 సీనియర్స్ మహిళా ఛాలెంజర్ ట్రోఫీ మ్యాచ్‌లు కటక్‌లో జరగనున్నాయి. ఇందులో ఇండియా ఏ, బీ జట్లు తలపడతాయి. స్మృతి మంథాన నాయకత్వంలోని ఇండియా–బీ జట్టు తరఫున అంజలి ఆడనుంది. అందులోనూ రాణిస్తే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. -
సత్తాచాటుతున్న ఉమాదేవి
ఏలూరు రూరల్: ఆమె బౌలింగ్ ప్రారంభిస్తే ప్రత్యర్థులకు హడలే. బాల్ గింగిరాలు తిరుగుతూ వస్తుంటే ఎంతటి బ్యాట్స్ఉమెన్ అయినా చిత్తు కావల్సిందే. ఆమే దేవరపల్లికి చెందిన మహిళా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టి.ఉమాదేవి. ఆరేళ్లగా క్రికెట్ సాధన చేస్తున్న ఈమె ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది. దేవరపల్లి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న ఈమె ఆంధ్ర మహిళ కుంబ్లేగా అందరిచే కితాబు అందుకుంటోంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈమె నిరంతర సాధన చేసి క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతోంది. తోటి క్రీడాకారిణిల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈనెల 4వ తేదీ నుంచి 13 వరకూ గుంటూరులో ఏసీఓ మహిళ అకాడమీలో అండర్–19 జోనల్‌స్థాయి మ్యాచ్‌లు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఉమాదేవి నార్త్‌జోన్ జట్టును తన బౌలింగ్ ప్రతిభతో కుప్పకూల్చింది. 4 వికెట్లు తీసి జిల్లా జట్టును విజయపథంలో నడిపించింది. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటికే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంది. మూడేళ్లుగా అండర్–16, 19 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. నేడు అండర్–19లో కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, హైదరాబాద్ తదితర జట్లతో తలపడి జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడేందుకు కృషి చేస్తోంది. ఈమె ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నెలకు రూ.4 వేలు ఉపకార వేతనం అందిస్తున్నారు. సహాయ కార్యదర్శులు ఎం. వగేష్‌కుమార్ ఉమాదేవికి సహకారం అందిస్తున్నారు. కోచ్ ఎస్. రమాదేవి వద్ద శిక్షణ పొందుతున్న ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రత్నకుమారి వ్యవసాయం చేస్తున్నారు. -
సిల్వర్‌స్క్రిన్‌పై జులన్ గోస్వామి జీవిత కథ
-
వెండితెరపై మహిళా క్రికెటర్ బయోపిక్
కోల్‌కతా: మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ బయోపిక్‌లు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ తరహాలోనే ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ దర్శకుడు సుశాంత దాస్ తాజాగా వెల్లడించారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఝులన్ గోస్వామి అద్భుతమైన ప్రదర్శనతో.. భారత్ జట్టుని ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ మూడు వికెట్లు పడగొట్టి.. ఆ జట్టుని తక్కువ స్కోరుకు పరిమితం చేసింది. కానీ.. మన బ్యాటర్లు చివర్లో తడబడటంతో భారత్ తృటిలో కప్‌ను గెల్చుకునే అవకాశం చేజార్చుకుంది. ‘ఝులన్ గోస్వామి పాత్ర పోషించే నటి కోసం వెతుకుతున్నాం. సినిమా కోసం సంతకం చేసే వరకూ పేరు వెల్లడించం. అయితే.. బాలీవుడ్ ప్రముఖ నటితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమా హిందీ భాషలో మాత్రమే తెరకెక్కనుంది. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఐసీసీ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ రికార్డు సృష్టించాడు. మురళీతో పాటు ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు పడ గొట్టిన మురళీ 2011 ప్రపంచకప్ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. -
మరో ఆసీస్ మహిళా క్రికెటర్ పై నిషేధం
బెట్టింగ్‌కు పాల్పడినందుకు శిక్ష సిడ్నీ: బెట్టింగ్‌కు పాల్పడినందుకు ఆస్ట్రేలియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ నిషేధానికి గురైంది. బిగ్‌బాష్ టి20 లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్లీ పీపా క్లీరీపై ఆరు నెలల నిషేధం విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పురుషుల జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌పై క్లీరీ 15.5 ఆస్ట్రేలియన్ డాలర్ల (దాదాపు రూ. 758) అతి స్వల్ప మొత్తానికి పందెం కాసింది. బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు బెట్టింగ్‌కు పాల్పడటం నిబంధనలకు విరుద్ధం. బెట్టింగ్ విషయంలో క్రికెటర్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యవహారాలను సహించబోమని సీఏ అవినీతి వ్యతిరేక విభాగం అధికారి ఇయాన్ రాయ్ స్పష్టం చేశారు. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై బెట్టింగ్ కాసి పట్టుబడిన ఆస్ట్రేలియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ ఏంజెలా రీక్స్ కూడా ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటోంది.