
అంజలి శర్వాణి (ఫైల్)
కర్నూలు, ఆదోని: పట్టణానికి చెందిన మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి సత్తా చాటుతోంది. నిలకడగా రాణిస్తూ ఇండియా–బీ మహిళల జట్టులో చోటు సంపాదించింది. ఈ మేరకు సోమవారం రాత్రి బీసీసీఐ నుంచి సమాచారం అందిందని అంజలి తండ్రి బీవీ రమణ తెలిపారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు పుదుచ్చేరిలో టీ–20 మహిళా ఛాలెంజర్స్ ట్రోఫీ అండర్ –23 క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో అండర్–23 ఇండియా–బీ జట్టుకు అంజలితో పాటు కోడుమూరుకు చెందిన ఎన్.అనూష కూడా ప్రాతినిథ్యం వహించారు.
ఈ టోర్నీలో అంజలి బాగా రాణించడంతో ఇండియా–బీ సీనియర్స్ జట్టుకు ఎంపిక చేశారు. జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు టీ–20 సీనియర్స్ మహిళా ఛాలెంజర్ ట్రోఫీ మ్యాచ్‌లు కటక్‌లో జరగనున్నాయి. ఇందులో ఇండియా ఏ, బీ జట్లు తలపడతాయి. స్మృతి మంథాన నాయకత్వంలోని ఇండియా–బీ జట్టు తరఫున అంజలి ఆడనుంది. అందులోనూ రాణిస్తే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment