
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్: క్రికెట్ టోర్నీల్లో చాన్స్ ఇస్తామంటూ తనని ఓ వ్యక్తి మోసం చేశాడని మహిళా క్రికెటర్ ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీన క్రికెటర్ ఓ వ్యక్తి వాట్సప్ కాల్ చేశాడు. మీరు చాలా బాగా క్రికెట్ ఆడతారని, మీ ఆట గురించి కొందరి కోచ్‌ల నుంచి సమాచారం తెలుసుకుని కాంటాక్టు అయ్యానన్నాడు.
స్టేట్ లెవెల్, ఇంటర్ స్టేట్ లెవెల్ లీగ్‌లో చాన్స్ ఇస్తామని, కొంత ఖర్చు అవుతుందని మాయ మాటలు చెప్పి దఫాలుగా రూ.1లక్షా 25వేలు కాజేశారు. మూడు నెలల్లో ఒక్క మ్యాచ్‌కు చాన్స్ ఇవ్వకపోగా మరిన్ని డబ్బులు కావాలంటూ వేధిస్తున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment