
సిడ్నీ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గురువారం కన్నీటి పర్యంతమయ్యాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా సిరాజ్ కంట తడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె సిరాజ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్వారంటైన్ నిబంధనల కారణంగా భారత్‌కి తిరిగి వెళ్లే అవకాశం లేనందన టెస్టుల్లో ఆడేందుకే సుముఖత చూపించాడు. రెండో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి గాయం కారణంగా సిరాజ్‌కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే. (ఎంపీఎల్‌లో కోహ్లి పెట్టుబడులు)
ఈ నేపథ్యంలో గురువారం టెస్టు ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపించే సందర్భంలో తండ్రిని గుర్తుచేసుకొని సిరాజ్ భావోధ్వేగానికి లోనయ్యాడు. ఇక మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. (న్యూజిలాండ్ నంబర్‌వన్)
✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021
Comments
Please login to add a commentAdd a comment