
పూర్తిగా ఏకపక్షమైన మూడో టెస్టు మ్యాచ్ పిచ్‌పై మ్యాచ్ రిఫరీ ఎలాంటి నివేదిక ఇస్తాడో ఆసక్తికరంగా మారింది. ఏ పిచ్ అయిన ఏకపక్షంగా సాగితే అది మంచి పిచ్ కానే కాదు. ఇపుడు వాండరర్స్ పూర్తిగా బౌలర్లకే మొగ్గు చూపుతోంది. ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌గా కితాబు అందుకున్న వారు కూడా ఈ పిచ్‌పై విలవిలలాడుతున్నారు. ఇలాంటి పిచ్‌పై కూడా చతేశ్వర్ పుజారా ఆటతీరును చూస్తే ఒక దశలో భారత్ 300 స్కోరు చేస్తుందనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్నకొద్దీ పరుగులే గగనంగా, క్రీజ్‌లో నిలవడమే కష్టంగా మారింది. పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ అంతకంతకూ కష్టమే అని చెప్పాలి.
కానీ భువీ మాత్రం రెండు విభాగాల్లో ఆకట్టుకున్నాడు. పేసర్ షమీ కేప్‌టౌన్‌లో కొనసాగించిన జోరును ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. భారత్ స్కోరు మరీ తక్కువగా ఉండటంతో హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టి భువీ, ఇషాంత్ శర్మ, బుమ్రాలపైనే ఆధారపడ్డాడు. వీళ్లు మనసు పెట్టి బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా కూడా తక్కువస్కోరుకే ఆలౌటైంది. ఇప్పుడు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో భారీస్కోర్లు చేయడంపైనే దృష్టిపెట్టాలి. అప్పుడే టెస్టును గెలిచి సిరీస్‌లో ఊరట పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment