Portuguese
-
ది బోమ్ జీసస్: ఎడారిలో ఓడ... బోలెడంత బంగారం!
సుమారు 500 సంవత్సరాల క్రితం బంగారం , ఇతర సంపదతో భారతదేశానికి వెళుతుండగా అదృశ్యమైన పోర్చుగీస్ ఓడ అవశేషాలు నమీబియా ఎడారి తీరప్రాంతంలో గుర్తించారు. నైరుతి ఆఫ్రికాలోని ఎడారిలో బంగారు నాణేలతో ఉన్న ఓడను గుర్తించడం పురావస్తు పరిశోధనల్లో వెలుగు చూసిన అద్భుతంగా భావించారు. రెండు వేల స్వచ్ఛమైన బంగారు నాణేలు 44 వేల పౌండ్ల రాగి కడ్డీలు దాదాపుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. బోమ్ జీసస్ అనేది సబ్-సహారా ఆఫ్రికాలోని పశ్చిమ తీరంలో గుర్తించిన అత్యంత పురాతనమైన , అత్యంత విలువైన ఓడ. బోమ్ జీసస్ (ది గుడ్ జీసస్) ఓడ పోర్చుగల్‌లోని లిస్బన్ నుండి 1533న మార్చి 7 శుక్రవారం బయలుదేరిన పోర్చుగీస్ నౌక. కానీ 2008లో నమీబియా ఎడారిలో దీని అవశేషాలను గుర్తించినపుడు మాత్రమే ఈ ఓడలోని అద్భుత నిధి గురించి తెలిసింది. నైరుతి ఆఫ్రికాలోని డైమండ్ మైనింగ్ పనుల్లో నామ్దేబ్ డైమండ్ కార్పొరేషన్‌లోని కార్మికులు దీన్ని గుర్తించారు. బంగారం, రాగితో వంటి విలువైన సంపదతో ఇండియాకు వెళుతుండగా భయంకరమైన తుఫానులో చిక్కుకుని ఉంటుందని భావించారు.నమీబియా తీరంలో తుఫాను కారణంగా ఒడ్డుకు చాలా దగ్గరగా వచ్చినపుడు బోమ్ జీసస్ మునిగిపోయిందని అంచనా. దీని వలన ఓడ ముందు భాగం రాయితో ఢీకొని బోల్తా కొట్టింది. అయితే తీరప్రాంత జలాలు తగ్గుముఖం పట్టడంతో, బోమ్ జీసస్ అవశేషాలు బయల్పడ్డాయి. అయితే చెల్లాచెదురుగా కనిపించిన కొన్ని మానవ ఎముకలు తప్ప మరేమీ వీటిల్లో గుర్తించకపోవడంతో ఓడలోని సిబ్బంది శిధిలాల నుండి బయటపడటమో లేక మరణించడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్‌కి చెందిన చీఫ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నోలీ దీనిపై మరింత పరిశోధన చేశారు. బంగారు, వెండి, రాగి కడ్డీల నిధిని గుర్తించారు. దీనిపై బ్రూనో వెర్జ్ అనే సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తను సంప్రదించారు డా. నోలీ. ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించి మూడు ఖండాలకు చెందిన వస్తువులతో ఉన్న ఓడ ప్రమాదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు. -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి
మోటోజీపీ రైడర్.. 31 ఏళ్ల పోల్ ఎస్పార్గారో తీవ్రంగా గాయపడ్డాడు. పోర్చుగీసు గ్రాండ్‌ప్రిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ రేసులో ఎస్పార్గారో బైక్ పట్టు తప్పడంతో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. కెటీఎమ్ బైక్‌తో రేసులో పాల్గొన్న ఎస్పార్గారో ల్యాప్-1 పూర్తి చేసి రెండో ల్యాప్‌ను మరికొన్ని సెకన్లలో పూర్తి చేస్తాడనగా టర్న్-10 వద్ద బైక్ పట్టు తప్పింది. అంతే బండితో పాటు రోడ్డుపై పడిపోయిన ఎస్పార్గారో దాదాపు 60 మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లాడు . దీంతో వెంటనే రెడ్ ఫ్లాగ్ చూపించి రేసును నిలిపివేశారు. 30 నిమిషాల పాటు అతనికి ప్రాథమిక చికిత్స నిర్వహించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతని చాతి బాగానికి, పల్మనరీ కంట్యూషన్, దవడ బాగంలో బలంగా దెబ్బలు తగిలినట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్‌లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్‌వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్‌గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్‌లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్‌లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్‌ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్‌లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్‌కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్‌లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్‌లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్‌లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
సర్దార్ పటేల్ మరికొంత కాలం బతికుంటే.. గోవా విమోచన ముందే జరిగేది
పనాజి: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ మరికొంత కాలం బతికుంటే పోర్చుగీసు పాలన నుంచి గోవా విమోచన ముందే జరిగేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనకు 1947 స్వాతంత్య్రం వచ్చినప్పటికీ గోవా చాలాకాలం పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టి 1961 డిసెంబరు 19న గోవాకు వలసపాలన నుంచి విముక్తి కల్పించింది. గోవా భారత్‌లో భాగమైంది. ఆదివారం 60వ గోవా విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ మాట్లాడుతూ... సర్దార్ పటేల్ గనక మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవా ప్రజలు 1961 కంటే చాలాముందుగానే స్వేచ్ఛావాయువులు పీల్చేవారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన పటేల్ 1950 డిసెంబరు 15న తుదిశ్వాస విడిచారు. నిజాం పాలనలోని ప్రస్తుత తెలంగాణ, మరఠ్వాడా, కల్యాణ కర్ణాటక (ఐదు జిల్లాలు)తో సహా దేశంలోని పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి పటేల్ ఉక్కుమనిషిగా పేరొందారు. గోవా విమోచన ఆలస్యం కావడానికి నెహ్రూయే కారణమని గతంలో పలువురు బీజేపీ అన్నారు. గోవా విమోచన కోసం పోరాడిన స్థానికులకు, ఇతర ప్రాంతాల వారికి నివాళులర్పించిన మోదీ వారి కృషిని కొనియాడారు. భారత స్వాతంత్య్రంతో గోవా విమోచన పోరాటం ఆగిపోకుండా నాటి సమరయోధులు చూసుకున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినా... దేశంలోని ఒక భాగమైన గోవా (డయ్యూ– డామన్తో కలిసి) ఇంకా పరాయిపాలనలోనే ఉందనే భావనతో స్వతంత్ర ఫలాలను భారతీయులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారన్నారు. అందుకే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సర్వస్వం వదిలి గోవా ప్రజలతో కలిసి విమోచన కోసం పోరాడారన్నారు. శతాబ్దాల తరబడి వలస పాలకుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా ప్రజలు తమ భారతీయతను మర్చిపోలేదన్నారు. అలాగే మొఘలాయిల పాలనలో మగ్గిన భారత్ కూడా గోవాను ఏనాడూ మరువలేదన్నారు. సుపరిపాలనలో పలు అంశాల్లో ముందంజలో ఉన్నందుకు గోవా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. తలసరి ఆదాయం, బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ప్రతి గడపకూ వెళ్లి చెత్త సేకరణ, ఆహార భద్రత అంశాల్లో గోవా అగ్రస్థానాన ఉందని మోదీ వివరించారు. దివంగత మాజీ సీఎం మనోహర్ పారిక్కర్‌ను గుర్తుచేసుకున్నారు. గోవాకు ఉన్న వనరులు, అవకాశాలను చక్కగా గుర్తించి అభివృద్ధి పథాన నడిపారని పారిక్కర్‌ను కొనియాడారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ మిరామర్‌లో వాయుసేన, నావికాదళ విన్యాసాలను తిలకించారు. -
ప్రెసిడెంట్ ఆడియో టేప్ లీక్.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు
లిస్బన్: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్‌కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
Corona Crisis: ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా యూరప్‌లో చదివే ఛాన్స్ !
వెబ్‌డెస్క్ : కరోనా ఇంకా కంట్రోల్లోకి రాకపోవడంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. వ్యాక్సినేషన్లో ముందున్న యూఎస్, యూరప్ దేశాలకు తమ పిల్లల్ని పంపే ప్రణాళికలో సంపన్న వర్గాల ప్రజలు ఉన్నారు. ఇలాంటి వారి కోసం పొర్చుగల్ దేశానికి చెందిన అరేతా పోర్చుగల్ విజన్ ఫండ్ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. అక్కడే స్థిర నివాసం యూరప్‌లో రియల్ రంగంలో వ్యాపారం చేస్తోన్న అరేతా పోర్చుగల్ విజన్ ఫండ్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే పోర్చుగల్‌లో పర్మినెంట్‌గా నివసించే అవకాశం కల్పిస్తామంటూ తెలిపింది. అ అవకాశం పొందాలంటే ఈ సంస్థలో 3,50,000 యూరోలు అంటే మన కరెన్సీలో రూ. 3.09 కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 2021 జులై 1 నుంచి ఈ స్కీం ప్రారంభించనున్నట్టు ఆరేతా సంస్థ సీఈవో ఆశీష్ సరాఫ్ ప్రకటించారు. చదువు ఒకే పర్మినెంట్ నివాసానికి సంబంధించిన గోల్డెన్ వీసా ఉంటే అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి. పోర్చుగల్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్నాళ్లైన అక్కడే నివసించవచ్చు. దీంతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్య దేశాల్లోకి రాకపోకలు సుళవు అవుతుంది. ఎంట్రన్స్‌లు, టెస్టులు తదితర వ్యవహరాలు లేకుండా ఈయూ దేశాల్లో చదువుకొవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు వంటి ప్రయోజనాలు అందవు. యూరప్ క్రేజ్ ఎంత స్వదేశీ అభిమానం మనలో ఉన్నా .... యూరోపియన్ లైఫ్ స్టైల్ అన్నా అక్కడి వాతవరణ పరిస్థితులు అన్నా ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సంపన్న వర్గాల వారికి యూరప్ అంటే వల్లమానిన అభిమానం. అందువల్లే కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది సంపన్న వర్గాల వారు విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది యూరప్‌కే వెళ్లారు. గోల్డెన్ వీసా 2012లో పోర్చుగీసు ప్రభుత్వతం గోల్డెన్ వీసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం రూ. 3.09 కోట్లు పెట్టుబడులు పెట్టిన వారికి సులువుగా పోర్చుగల్‌లో నివసించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ గోల్డెన్ వీసా గడువు 2021 డిసెంబరుతో ముగియనుంది. కొత్త నిబంధనలతో తిరిగి 2022 జనవరి నుంచి ప్రారంభం కానుంది. అయితే పెట్టుబడి మొత్తం దాదాపు రెట్టింపు కానుంది. దీంతో జులై నుంచి డిసెంబరు వరకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థిర నివాసం అవకాశం అరేతా సంస్థ కల్పిస్తోంది . చదవండి : క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..! -
'రొనాల్డో క్షమాపణ చెప్పాలి'
లిస్బాన్: తమ జర్నలిస్టు దగ్గర మైక్రోఫోన్ లాక్కొని పక్కనే ఉన్న చెరువులోకి విసిరేసిన ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ పోర్చుగీసు టీవీ నెట్వర్క్ కారియో ద మన్హా డిమాండ్ చేసింది. తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో రొనాల్డ్ వ్యవహరించిన తీరు యావత్ పోర్చుగీసు జాతికే అవమానకరమని టీవీ నెట్ వర్క్ డైరెక్టర్ కార్లోస్ రాడ్రిగ్యూస్ విమర్శించారు. ఈ ఘటనపై పోర్చుగీసు ఫుట్ బాల్ ఫెడరేషన్తో పాటు, రొనాల్డో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా బుధవారం జరిగే తదుపరి పోరుకు పోర్చుగీసు ఏ విధంగా సన్నద్ధమవుతుందంటూ తమ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రొనాల్డ్ నైతిక విలువల్ని మరచిపోయి వ్యవహరించడం ఎంతమాత్రం తగదన్నారు. ఆ జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా, మైక్రోఫోన్ లాక్కొని చెరువులో పడేయటం అతని అహంకారానికి నిదర్శమని రాడ్రిగ్యూస్ తెలిపారు. దీనిపై రొనాల్డో తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
గోవు నుంచి గోవా...
పేరులో నేముంది మహాభారతం దీనిని గోపరాష్ట్రం అన్నది. గోవరాష్ట్రం కూడా అన్నది. వేలాది ఏళ్లుగా ఈ ప్రాంతం గోమంత, గోవంచ, గోపకపట్టం, గోవెమ్, గోమంతక్ వంటి పేర్లతో గుర్తింపబడింది. గోవులు ఎక్కువగా ఉండే ప్రాంతం కనుకనే ఎవరు ప్రస్తావించిన ‘గో’ శబ్దాన్ని తప్పనిసరిగా జోడించేవారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఆ గడ్డపై తొలిసారి పాదం మోపాక క్రమంగా ఆ పేరు గోవాగా స్థిరపడింది. తమను ఇక్కడ దాకా చేర్చిన గొప్ప నావికుడు వాస్కో డ గామా పేరుతో ఉన్న పట్టణమే గోవాలో ఇప్పటికీ పెద్ద పట్టణం. గోవా పురాతన (పోర్చుగల్) సంస్కృతి చూడాలంటే మాత్రం మార్గోవ్ పట్టణానికి వెళ్లాల్సిందే! -
నా కల నెరవేరబోతోంది
పణజి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించాలనేది తన కలని బ్రిటిష్ నటి సమీరా మహ్మద్ అలీ తెలిపింది. త్వరలో విడుదల కానున్న ‘బీ పాజిటివ్’ సినిమాలో ఈ మోడల్ అమితాబ్‌తో నటిస్తోంది. ‘భారతీయ నటులందరిలోకి అమితాబ్ నా ఫేవరెట్. అద్భుతమైన నటుడు. దుబాయ్‌లో ఉన్న సమయంలో అవకాశమున్నంతవరకూ అమితాబ్ సినిమాలే చూస్తూ పెరిగా. నిజంగా అంత గొప్ప స్టార్ సరసన నటించడమంటే నిజంగా ఓ కలే’ అని అంది. 29 ఏళ్ల ఈ వయ్యారి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా గోవాలో ఉంది. ఈ సినిమాకు వె ంకటేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్, సమీరతోపాటు రాజ్ పురోహిత్, నివేదిత బిశ్వాస్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలో నటించడం ఇబ్బందికరంగా అనిపించడం లేదా అని ప్రశ్నించగా ఈ సినిమాని ఎంత బడ్జెట్‌తో తీస్తున్నారనేది విషయమే కాదంది. ఈ సినిమా కంటెంట్‌ను మాత్రమే తాను పరిగణనలోకి తీసుకున్నానంది. లండన్‌లో చిన్న బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తాయని పేర్కొంది. మూడు భాషల్లో తీస్తున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకర్షించిందంది. అయితే ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషిస్తోందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. స్టోరీలైన్ చెప్పగానే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని చెప్పింది. ఈ సినిమా స్టోరీ లైన్ తనకు ఎంతో ఆసక్తి కలిగించిందంది. అందువల్లనే ఈ సినిమా కోసం తన షెడ్యూల్‌ను మార్చేసుకున్నానంది. కాగా అరబ్, పోర్చుగీస్ జంటకు పుట్టిన సమీర తనకు భారతీయ సంప్రదాయంతో సంబంధముందంది. -
లిస్బన్ ఫ్యాషన్ వీక్