aneesha
-
బైక్‌పై తల్లీకూతురు..కేరళ To కాశ్మీర్
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు. కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్‌పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్‌పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది. మహిళల ప్రయాణం ‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా. వారం దాటాకే సమాచారం రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష. -
పులికి శిక్షణ ఇచ్చి నిద్రపుచ్చడం చూశాను..
చెన్నై ,పెరంబూరు: అనీషాతో ప్రేమ ఎలా మొదలైందంటే అని నటుడు విశాల్ చెప్పుకొచ్చారు. ఈయన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త దినేశ్‌రెడ్డి, సరిత దంపతుల కూతురు అనీషా అల్లారెడ్డిని పెళ్లాడబోతున్న విషయాన్ని ఇటీవల బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంట వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హల్చల్ చేస్తోంది. అనీషారెడ్డి నటి అన్నది గమనార్హం. తెలుగులో అర్జున్‌రెడ్డి, పెళ్లిచూపులు వంటి చిత్రాల్లో నటించారు. ఈమె సామాజిక సేవల్లోనూ తన వంతు కృషిచేస్తున్నారు. అంతేకాదు అనీషా జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ఆమెతో పరిచయం ఎలా ప్రేమగా మారింది అన్న విషయాలను నటుడు విశాల్ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అవేంటో చూద్దాం. నేను గత ఏడాది అక్టోబర్‌లో విశాఖపట్టణంలో జరిగిన అయోగ్య చిత్ర షూటింగ్లో పాల్గొన్నాను. అప్పుడు ఆ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటున్న మహిళలు మాత్రమే నటిస్తున్న ఆల్ అబౌట్ మిచ్చలో అనే అంగ్ల చిత్ర యూనిట్‌ను కలిసే అవకాశం లభించింది. ఆ చిత్రంలో అనీషా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు నటించడం చూసి ఆకర్షితుడినై ఆ చిత్ర నిర్మాణాన్ని నేనే చేపట్టాను. అప్పటి నుంచి ఆ చిత్రానికి సంబంధించిన వ్యవహారాల గురించి తరచూ అనీషాను కలుసుకునేవాడిని. ఆ పరిచయమే ఇప్పుడు పెళ్లికి దారి తీసింది. భగవంతుడు ఆమెను నాకోసం పంపారు. అనీషాతో ముందుగా నేనే ప్రేమను వ్యక్తం చేశాను. వివాహనంతరం అనీషాను నటించవద్దని చెప్పను. ఆమెకు ఏది ఇష్టమో అది చేయవచ్చు. పులికి శిక్షణ: సమీపం కాలంలో అనీషా పులికి శిక్షణ ఇస్తున్న వీడియోను చూశాను. అందులో త ను పులికి శిక్షణ ఇచ్చి నిద్రపుచ్చడం చూశాను. నేను మృగాలతో ఒక చిత్రం చేయాలని నిర్ణయిం చుకున్నాను. దానికి అనీషా తోడ్పాటును కోరతాను. అన్నీ సక్రమంగా ఉంటే ఈ ఏడాదే ఆ చిత్రాన్ని రూపొందిస్తాను. ఆ చిత్రంలో అనీషా పా ల్గొంటారు. అదే విధంగా కొత్తగా నిర్మిస్తున్న నడిగర్‌సంఘం భవనంలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయాన్నీ అనీషాకు చెప్పాను. అం దు కు తనూ ఓకే చెప్పారు అని విశాల్ పేర్కొన్నారు. నా ప్రేమికుడిని కలిశాను: కాగా విశాల్‌కు కాబోయే జీవిత భాగస్వామి అనీషా తన ట్విట్టర్లో పేర్కొంటూ కొత్త జీవితంలోకి ప్రవేశించనున్నాను. నాతో పయనించే, నా సుఖ దుఖాలతో పాలు పంచుకునే నా ప్రేమికుడిని కలుసుకున్నాను. ఆయన కోసమే ఇంతకాలం ఎదురు చూశాను అని ఆనందంతో పేర్కొన్నారు. -
ఆటో ఆతిథ్యం.. చౌక ధరలో విదేశీ రుచులు
సాక్షి,వీకెండ్: నేషనల్ బేకరీ స్కూల్ లండన్ నుంచి డిగ్రీ పొందిన అనీషా, యూకేలో ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న ఉర్వశ్ కన్నా, ఆశిశ్ ఇమాన్యుల్‌లు తలచుకుంటే ఆరంకెల జీతంతో ఉద్యోగం వలచి వరించేదే. అయితే రొటీన్ జాబ్‌పై ఆసక్తి లేని ఈ ముగ్గురి ఆలోచనలకు రూపమే హాట్ డాగ్ ఎక్స్‌ప్రెస్ ఆటో. ‘రోడ్ మీద ఫాస్ట్‌ఫుడ్ అందించాలి. అది ఇక్కడి వారికి హైజీన్‌గా, హైటేస్టీగా అనిపించాల’ని ఆలోచించిన ఈ మిత్ర బృందం... అంతర్జాతీయంగా పాపులర్ అయిన హాట్ డాగ్ వంటకాలని ఇక్కడ పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. బ్రిటీష్ వంటకాల్లో ఒకటి హాట్ డాగ్. వాటిలో చికెన్ హాట్ డాగ్స్ వీరు తయారు చేస్తున్నారు. వీటి కోసం వాడే బ్రెడ్, సాస్‌లు అన్నీ వీరే తయారు చేస్తుండడం విశేషం. సిటీలో హాట్ డాగ్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ‘మొదట ఫుడ్ ట్రక్స్ అనుకున్నాను. అయితే పెద్ద వెహికల్స్ సిటీ ట్రాఫిక్‌లో కష్టమని, ఆటోలు అయితే బెటర్ అనిపించింది. ఎన్ఐడీ బెంగుళూర్ విద్యార్థుల సహకారంతో ఈ ఆటోలు డిజైన్ చేయించాం. గతేడాది జనవరిలో ఈ ఆటో ఫుడ్ సర్వీస్ ప్రారంభించాం. తొలుత మూడు ఆటోలతో ప్రారంభించినా.. తర్వాత నగరవ్యాప్తంగా 12 ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా ప్రచారంతో చాలా మంది మాకు రెగ్యులర్ కస్టమర్లుగా మారార’ని చెప్పారు డైరెక్టర్ ఉర్వశ్ కన్నా. హాట్ డాగ్ ఆన్ కాల్.. పార్టీ, గెట్ టు గెదర్.. ఇలా ఈవెంట్ సిటీలో, శివార్లలో ఎక్కడ ప్లాన్ చేసుకున్నా అక్కడికి ఈ హాట్ డాగ్ ఆటోలు వచ్చేస్తాయి. కాల్ చేస్తే సరాసరి ఈవెంట్ జరుగుతున్న చోటుకే ఆటో వచ్చేస్తుంది. అయితే హాట్ డాగ్‌ల ఖరీదు తప్ప దీని కోసం ప్రత్యేకమైన చార్జీలు ఉండవు. మసాల దినుసులతో స్పైసీగా ఉండే ఇన్సేన్, కెచప్, మస్టర్డ్తో ఉండే క్లాసిక్ అమెరికన్ హాట్ డాగ్ రెబెల్, నేరుగా చేతితో ముట్టుకోకుండా తయారు చేసిన చికెన్ సాసేజ్ హాట్ డాగ్‌లు రెండు రకాల సాస్‌లతో ఈ ఆటో వడ్డించే మెనూలో సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సింగిల్ హాట్ డాగ్ రూ.60, మూడు చిన్న హాట్ డాగ్స్ ప్యాక్ రూ.99 ధరల్లో అందిస్తున్నారు. వీటి తయారీలో సైతం స్నేహ బృందం స్వయంగా పాలుపంచుకుంటూ రుచుల విషయంలో కేర్ తీసుకుంటుండడం విశేషం. ‘డిజైన్, టేస్ట్ విషయంలో పూర్తి నిర్ణయం నాదే. సాస్‌లు అన్నీ నేను తయారుచేసినవే. ఇందులో చెఫ్్సకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. తప్పనిసరిగా ఫ్రెష్ బ్రెడ్‌నే వాడుతాం. బ్రెడ్స్ మిగిలితే చారిటీకి ఇచ్చేస్తాం. ఆటోలో ఉన్న ఎక్విప్మెంట్ సైతం మేం డిజైన్ చేసిందేన’ని చెప్పారు చెఫ్ అనీషా. ‘డిజైనింగ్, రీసెర్చ్, ఫారిన్ ట్రిప్స్, ఎక్విప్మెంట్, ఆటోలు... ఇలా అంతా కలుపుకుని రూ.కోటి పెట్టుబడితో 2015లో వ్యాపారం ప్రారంభించాం. బెంగుళూర్కూ మా సర్వీస్ విస్తరిస్తున్నామ’ని చెప్పారు డైరెక్టర్ ఆశిశ్ ఇమాన్యుల్. నిర్వాహకులు.. ఆశిశ్ ఇమాన్యుల్, అనీషా, ఉర్వశ్ కన్నా -
అక్కయినా అమ్మలా చూస్తుంది!
రిలేషణం చెల్లెళ్లందరూ అక్కయ్యలను అనుకరిస్తూ ఉంటారు. అక్క కంటే ఎక్కువ మార్కులు కొట్టేయాలనుకుంటారు. అనీషా కూడా చిన్నతనంలో అలానే చేసింది. కానీ ఇప్పుడు అలా చేయలేనంటుంది. అక్కయ్య అంటే ఎంత ఇష్టమున్నా ఆమె మార్గంలో నడిచే ఉద్దేశం తనకు లేదని చెప్పేసే అనీషా... అందాల భరిణె దీపికా పదుకొనే చెల్లెలు. అక్కయ్యతో పెనవేసుకున్న అనుబంధం గురించి అనీషా చెబుతోన్న కబుర్లు... అక్కకీ నాకూ అయిదేళ్లు తేడా. ఎంత కొట్టుకునేవాళ్లమంటే... ఆ తర్వాత అమ్మ మమ్మల్ని కొట్టకుండా కంట్రోల్ చేసుకోలేనంత అల్లరి చేసేవాళ్లం. చాక్లెట్లు, బొమ్మల కోసం యుద్ధాలు చేసేవాళ్లం. అయిదేళ్ల గ్యాప్ మరీ ఎక్కువేమీ కాదు కదా! అందుకే ఒకరినొకరు అర్థం చేసుకునేంత పరిణతి ఇద్దరికీ ఉండేది కాదు. అందుకే తగాదాలు పడేవాళ్లం. పోటీ పడేవాళ్లం. అయితే కాలం గడిచేకొద్దీ, వయసు పెరిగేకొద్దీ అక్కలో చాలా మార్పు వచ్చింది. నన్ను చూసుకోవడం తన బాధ్యత అన్నట్టుగా తను మారిపోయింది. అక్క చాలా కేరింగ్‌గా ఉంటుంది. అవతలివాళ్ల మనసు తెలుసుకుని ప్రవర్తించడం తన నైజం. ఇతరుల విషయంలోనే అలా ఉంటే, ఇంట్లోవాళ్ల విషయంలో ఇంకెలా ఉంటుంది! ఇక నన్ను చూసుకోవడంలో తను అమ్మతో పోటీపడేదంటే అతిశయోక్తి కాదు. బయటకు వెళ్లినప్పుడు చేయి వదిలేది కాదు. ఎప్పుడూ కాచుకుని ఉండేది. అవన్నీ తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది... అలాంటి అక్క నాకు ఉన్నందుకు! నాన్న రక్తం మా ఇద్దరినీ క్రీడల వైపు నడిపించింది. ఇద్దరం మొదట ఆటల మీదే దృష్టి పెట్టాం. కానీ అక్కకి నటి అవ్వాలని రాసిపెట్టి ఉన్నట్టుంది. నేనేమో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని కావాలని కలలు కన్నాను. అది తప్ప దేనిమీదా ఆసక్తి లేదు నాకు. సినిమాలంటే అస్సలు పడవు మనకి. మేకప్పులు, కాల్షీట్లు, షెడ్యూళ్లు... నాకు సూటయ్యే విషయాలు కావు. అందుకే నన్ను ఎవరైనా ‘నువ్వు కూడా నటివవుతావా’ అని అడిగితే అక్క నవ్వేస్తుంది. నేనేం సమాధానం చెబుతానో తనకి తెలుసు కదా! అక్కయ్యకి నేను అన్ని విషయాలూ చెబుతాను. తన సలహా తీసుకోకుండా ఏ పనీ చేయను. నాకు తన సాయం అవసరమైన ప్రతిసారీ తను నాకు ఉంది. ఏ రోజూ అక్క లేదే, ఎలా అని బాధపడే పరిస్థితి రాలేదు. తనలో నచ్చే మరో విషయం... తొణకకపోవడం. తనపై వచ్చే గాసిప్స్ చూసి మేం కంగారుపడతామేమో కానీ, తను మాత్రం రియాక్ట్ అవ్వదు. అలా ఉండటం ఓ ఆర్ట్. అది అక్కకి బాగా వచ్చు! నేను తన సినిమాలన్నీ చూస్తాను. ఓం శాంతి ఓం, కాక్టెయిల్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, యే జవానీ హై దివానీ, లవ్ ఆజ్కల్ చిత్రాల్లో తన నటన బాగుంటుంది. ‘లఫంగే పరిందే’ అయితే సూపర్బ్. అంధురాలిగా ఎంత అద్భుతంగా నటించిందో! తనని నేను దారుణంగా విమర్శిస్తాను. ‘మొన్నటికి మొన్న... చెన్నై ఎక్స్‌ప్రెస్’ నాకసలు నచ్చలేదు అన్నాను. నవ్వేసింది. తనెప్పుడూ అంతే. దేనికీ నొచ్చుకోదు. విమర్శలను సైతం నవ్వుతూ స్వీకరిస్తుంది. సలహాలు చిన్నవాళ్లు ఇచ్చినా పాటిస్తుంది. ఆ స్వీట్నెస్ అంటే నాకు ఇష్టం. అంత స్వీట్‌గా ఉండే మా అక్కంటే ఇంకా ఇష్టం! అనీషాకి నిజాయతీ ఎక్కువ. మనసులో ఒకటి పెట్టు కుని, పైకి ఒకటి మాట్లాడటం తనకు చేతకాదు. మంచయినా, చెడయినా ముఖమ్మీదే చెప్పేస్తుంది. అందుకే నాకు అనిపిస్తుంది... తనకు సినీ పరిశ్రమకు సూట్ కాదని. తనకి కూడా పెద్ద ఆసక్తి లేదనుకోండి. తనకి ఆటలే ప్రపంచం. తనకేది ఆనందమో.. అదే మాకు ఆనందం. - దీపిక