'గర్ల్ఫ్రెండ్ కోసం కార్లు చోరీ చేశాడు' | boyfrined arrested in cars theft case in delhi | Sakshi
Sakshi News home page

'గర్ల్ఫ్రెండ్ కోసం కార్లు చోరీ చేశాడు'

Published Thu, May 1 2014 11:32 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

'గర్ల్ఫ్రెండ్ కోసం కార్లు చోరీ చేశాడు' - Sakshi

'గర్ల్ఫ్రెండ్ కోసం కార్లు చోరీ చేశాడు'

న్యూఢిల్లీ : ప్రేయసి కోరితే ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధం అంటూ సినిమాలో హీరోలు డైలాగులు చెబుతుంటారు. అయితే నిజ జీవితంలో మనవాడు ప్రాణం కాదు కానీ... ప్రయాణం వరకైతే ఓకే అనుకున్నాడేమో, ప్రియురాలిని లాంగ్డ్రైవ్కి తీసుకెళ్లేందుకు ఏకంగా 21 కార్లు చోరీ చేశాడు. అదీ కేవలం రెండు నెలల వ్యవధిలోనే. దొంగతనాలతో ప్రేయసి మనసు దోచుకున్న ఈ ఢిల్లీ దొంగ చివరకు కటకటాల పాలుకాక తప్పలేదు.

నిందితుడిని కీర్తినగర్కి చెందిన రవిత్యాగిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మొత్తం 21 కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ జిల్లా డీసీపీ రణ్వీర్ సింగ్ తెలిపారు. గత నెల 28న పోలీసు బృందం రమేశ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పికెట్ ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తుండగా హోండా సిటీ కారులో వెళుతున్న రవిత్యాగిపై అనుమానం వచ్చిందని, కారు కాగితాలు చూపించాల్సిందిగా కోరారని, అయితే వాటిని ఇవ్వకపోవటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గత నెల ఒకేరోజు మూడు కార్లు చోరీ చేసినట్టు అంగీకరించాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement