గోదావరిఖని: కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాదని ఓ మహిళ ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది నచ్చని ఆమె అన్న, మాజీ భర్త కలిసి ప్రియుడిని హత్య చేశారు. దీంతో నిర్వేదానికి గురైన ఆమె ఉరివేసుకుని జీవితాన్ని చాలించింది. గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన అంజలి (25) భర్త, ఇద్దరు పిల్లలను కాదని యైటింక్లయిన్ కాలనీకి చెందిన ప్రియునితో కాపురం సాగిస్తోంది.
పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రియుడితో ఉండేందుకే మొగ్గుచూపింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేమీ లేక ఇష్టపడిన ప్రియునితో పంపించేశారు. ఇలా 3 నెలలపాటు గడిచాయి. అయితే శుక్రవారం సద్దుల బతుకమ్మ రోజు చూ డాలంటూ అంజలికి అన్న ఫోన్ చేశాడు. నిజమని నమ్మిన ఆమె ప్రియుడిని ఎదురుగా పంపించింది.
చెల్లిని ఇంట్లో బంధించి బయట గడియవేసి ప్రియుడు వినయ్‌కుమార్ (26)ను అన్న, మాజీ భర్త కలిసి హతమార్చారు. ఈ సంఘటన తర్వాత అంజలిని పోలీసులు అదేరోజు పెద్దపల్లిలోని సఖీ కేంద్రానికి పంపించారు. అనంతరం గుంటూరుకు వెళ్లి న అంజలి చిన్నమ్మ ఇంట్లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment