కట్టిపడేసే ఆకృతి.. ఉట్టిపడే రాజసంతో ‘థార్’ వెహికిల్ ఆకట్టుకుంటోంది. ఇది మధ్యతరగతి నుంచి సంపన్న వర్గాల వరకు అందరి మనసూ దోచుకుంటోంది. ‘థార్’పై సవారీకి చాలామంది ఆసక్తి చూపుతుండడంతో జిల్లాలోనూ ఈ వాహనాల సంఖ్య పెరుగుతోంది. జిల్లా రోడ్లపై రయ్యిరయ్యిమంటూ దూసుకుపోతున్న ‘థార్’పై సండే స్పెషల్..
సాక్షి, కామారెడ్డి: కరోనా వ్యాప్తి తర్వాత చాలామంది కార్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో కార్ల సంఖ్య పెరుగుతోంంది. ఆర్థికశక్తి కూడా పెరగడంతో లగ్జరీ కార్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. మహీంద్ర కంపెనీ తయారు చేసిన ‘థార్’ మోడల్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు. రాజకీయ నాయకులు తమ కాన్వాయ్‌లో థార్‌లు ఉంచుకుంటున్నారు. వ్యాపారులూ ఈ వా హనంపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన వాళ్లు హుందాతనం కోసం థార్ మీద సవారీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేశారు. దీంతో ‘థార్’ వాహనాలు జిల్లా రోడ్లపై రయ్యిమంటూ పరుగులు తీస్తున్నాయి.
లాంగ్ డ్రైవ్‌కు అనుకూలం..
చాలామంది లాంగ్ డ్రైవ్‌కోసం థార్‌ను ఎంచుకుంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వాహనంలో విహార యాత్రలకు వెళ్లివస్తున్నా రు. కూర్చునేందుకు అనువుగా సీట్ల అమరిక ఉండడంతో ఇందులో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ధరతోపాటు మెయింటెనెన్స్ ఖర్చు కాస్త ఎక్కువే అయినా థార్‌ను కలిగి ఉండడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తుండడంతో జిల్లాలో వాహనాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందకుపైగా థార్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.
హుందాగా ఉంటుంది..
థార్‌లో వెళ్తే ఎంతో హుందాగా ఉంటుంది. ఎటైనా ఇదే వాహనంలో వెళ్తున్నా. మట్టి రోడ్లపై ప్రయాణించినా, గుట్టల మీదికి వెళ్లినా సౌకర్యవంతంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కోసం కూడా ఉపయోగపడుతుంది.
– సురేందర్‌రెడ్డి, కామారెడ్డి
పార్ట్‌నర్స్‌తో కలిసి..
వ్యాపార భాగస్వాములం కలిసి థార్‌ను కొనుగోలు చేశాం. ఇటీవల ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాను. ఫ్యామిలీతో వెళ్లడానికి ఈ వాహనం బాగుంటుంది. ఎంత ఎత్తు ప్రదేశమైనా ఎక్కడానికి ఉపయోగపడుతుంది.
– రాజు పాటిల్, దేవునిపల్లి, కామారెడ్డి
ఆకట్టుకునేలా..
థార్ మోడల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంది. రెగ్యులర్‌గా ఇందులోనే తిరుగుతున్నాం.
– పత్తి శ్రీనివాస్, పిట్లం
సౌకర్యవంతంగా ఉంటుంది
మహీంద్ర థార్ మోడల్ ఆకర్షణీయంగా కనిపి స్తుంది. కుటుంబంతో కలిసి ఎలాంటి రోడ్లపైనైనా ప్రయాణించడా నికి ఈ వాహనం సౌకర్యంగా ఉంటుంది.
– అంజద్‌ఖాన్, సీతాయిపల్లి, గాంధారి మండలం
థార్ కొనాలన్నది నా కల
థార్ మోడల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మోడల్‌ను కొనాలన్నది నా కల. దానిని నెరవేర్చుకున్నాను. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకూ ఇందులోనే వెళ్తా.
– సిద్ధి శ్రీధర్, ఎల్లారెడ్డి
పిల్లలూ ఇష్టపడతారు
నేను హైదరాబాద్‌లో ఉంటాను. పదిపదిహేను రోజులకు ఒకసా రి స్వగ్రామం బిచ్కుందకు వస్తుంటా. ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుని తిరిగి వెళ్తా. ఫ్యామిలీతో కలిసి వచ్చి వెళ్తుంటాం. ఇందులో ప్రయాణాన్ని పిల్లలూ ఎంజాయ్ చేస్తారు.
– నాలం శ్రీధర్, బిచ్కుంద
ఎటు వెళ్లాలన్నా..
థార్ వాహనం బాగుందని నేను కొనుగోలు చేశాను. కుటుంబ సభ్యులతో కలిసి ఎటు వెళ్లాలన్నా ఇందులోనే ప్రయాణిస్తున్నాం. సేఫ్ జర్నీకి ఇలాంటి వాహన అవసరం.
– భీంరెడ్డి, తిప్పాపూర్, భిక్కనూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment