Allu Arjun Wife Sneha Reddy Making Her Deubt Movie With Malayalam Cinema, Rumours Viral - Sakshi
Sakshi News home page

Allu Sneha Movies Entry: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్‌ భార్య?

Published Fri, Nov 4 2022 10:51 AM | Last Updated on Fri, Nov 4 2022 11:46 AM

Allu Arjun Wife Sneha Reddy Making Her Deubt Into Films - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉ‍న్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఫోటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది స్నేహ.

హీరోయిన్‌కి ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఈ అల్లువారి కోడలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ కూడా ఎక్కువే. ఈ క్రమలో సోషల్‌ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్న స్నేహకు రీసెంట్‌గా సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఓ ఆఫర్‌ వచ్చినట్లు ఫిల్మీ దునియాలో టాక్‌ వినిపిస్తుంది.

అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్‌ హీరో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఒకేవళ ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్‌ ఉంటే టాలీవుడ్‌ కాకుండా మాలీవుడ్‌ను ఎంచుకుంటుందా అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement