స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తనయుడు చిన్నారి అయాన్ డాక్టర్ గెటప్లో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శనివారం 'హాలోవీన్స్ డే' సందర్భంగా అయాన్ను డాక్టర్లా రెడీ చేసి అల్లు అర్జున్ తన సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. దాంతో అయాన్ నెట్లో లిటిల్ స్టైలిష్ స్టార్ అయిపోయాడు. హాలోవీన్స్ డే అనేది అమెరికాతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో జరుపుకొనే ఓ ఫెస్టివల్. 'హాలోవీన్స్ డే' ని 'సెయింట్స్ డే' అని కూడా అంటారు.
కాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'. ఆ చిత్ర ఆడియో విడుదల సందర్భంగా అల్లు అర్జున్ చిత్ర టీంకు విషెస్ తెలిపారు. శనివారం జరిగిన ఆడియో రిలీజ్కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. రాజ్ తరుణ్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Fun Stuff with my lil son ! Happy Halloween's Day ! pic.twitter.com/MEpToujAQE
— Allu Arjun (@alluarjun) October 31, 2015