
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందించిన ఈ మూవీకి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ అభిమానులు అంచనాలు మరింత పెంచేశాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
తాజాగా బడ్డీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులకు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. చిన్నప్పటి నుంచి మీ బెస్ట్ బడ్డీ ఎవరు? అని శిరీష్‌ను అడిగారు.
దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ..' నా బెస్ట్ బడ్డీ మా అన్నయ్య.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం.. మా డాడీ సినిమాలు చూస్తూ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండేవారు.. రెండు వారాలకొకసారి డాడీ వచ్చేవారు. నేను, అన్నయ్య 9 ఏళ్లపాటు ఓకే రూమ్‌లో ఉండేవాళ్లం. నాన్నతో కూడా షేర్ చేయలేని విషయాలను అన్నయ్యతోనే షేర్ చేసుకుంటా. విషయం ఏదైనా ముందు అతనికే ముందు చెబుతా. ' అని అన్నారు. కాగా.. బడ్డీ సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతతో చర్చించి టికెట్ రేట్లు తగ్గించామని తెలిపారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది.
నా అన్న.. నా బెస్ట్ "BUDDY"❣️
Sibling Goals ❤
My brother @alluarjun is my "BEST BUDDY" says Actor @AlluSirish!! 🫂#AlluArjun #AlluSirish #Buddy #TeluguFilmNagar pic.twitter.com/PAxyrX1hIx— Telugu FilmNagar (@telugufilmnagar) July 31, 2024