ఈ సినిమాలో హీరో నేను కాదు..ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యా: అల్లు శిరీష్ | Tollywood Hero Allu Sirish Latest Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Buddy Official Trailer: పుష్ప -2 గురించి ఇప్పుడు మాట్లాడను: అల్లు శిరీష్ కామెంట్స్

Jun 25 2024 7:03 PM | Updated on Jun 25 2024 7:29 PM

Tollywood Hero Allu Sirish Latest Movie Trailer Out Now

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ..' లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా? అని అడిగారు. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో  యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో నేను కాదు.. టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశా. పుష్ప -2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి.' అని అన్నారు.

ట్రైలర్ చూస్తే ఫుల్‌ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో తెగ ఆక‌ట్టుకుంటోంది. అన్యాయంపై పోరాడే టెడ్డీబేర్‌ను మీరెప్పుడైనా చూశారా..? అంటూ చెప్పే డైలాగ్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా చూశారా? అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేశారు. కాగా.. టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్ర‌లో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత  అజ్మ‌ల్ విల‌న్ పాత్ర‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement