ఐకాన్‌ స్టార్‌ అరుదైన ఘనత.. ఆ రోజే ముహుర్తం ఫిక్స్! | Allu Arjun's Wax Statue To Open At Madame Tussauds In London | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కు అరుదైన గౌరవం.. ఆ రోజే ముహుర్తం ఫిక్స్!

Published Thu, Mar 21 2024 9:56 PM | Last Updated on Fri, Mar 22 2024 9:53 AM

Allu Arjun Statue Open Madame Tussauds Museum InLondon - Sakshi

పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో బిజీ ఉన్నారు. అయితే బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అల్లు అర్జున్ కొలతలను గతేడాది అక్టోబర్‌లోనే సేకరించారు. దీంతో తమ అభిమాన హీరో విగ్రహం ప్రారంభోత్సవం కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా అభిమానుల నిరీక్షణకు తెరదించారు. బన్నీ మైనపు విగ్రహం ప్రారంభోత్సవానికి తేదీని నిర్ణయించారు. మార్చి 28న అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. మార్చి 28న రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విషయాన్ని దుబాయ్ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో బన్నీ విగ్రహం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement