ప్రభాస్‌ తరువాత మహేష్ | Mahesh Babu In Madame Tussauds Museum | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 12:31 AM | Last Updated on Fri, Apr 27 2018 2:39 PM

Mahesh Babu In Madame Tussauds Museum - Sakshi

‘భరత్‌ అనే నేను’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌బాబు హ్యాపీనెస్‌ ఇప్పుడు రెట్టింపు అయ్యింది. లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘‘ప్రతిష్టాత్మక మేడమ్‌ తుస్సాడ్స్‌లో భాగం కాబోతున్నందుకు సూపర్‌ హ్యాపీగా ఉంది. నా కొలతలను తీసుకోవడానికి వచ్చిన బృందానికి థ్యాంక్స్‌. వాళ్ల  డీటైలింగ్‌ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది’’ అన్నారు మహేశ్‌బాబు.

మహేశ్‌కు ఈ గౌరవం దక్కడంతో అభిమానులు ఆనందంగా ఫీల్‌ అవుతున్నారు. ఇది వరకు టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌కు ఈ గౌరవం దక్కిన విషయం తెలిసిందే.  మహేశ్‌ తాజా సినిమాల విషయానికొస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నెక్ట్స్‌ మూవీ రూపొందనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ నెక్ట్స్‌ సుకుమార్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ వంగాతో కూడా ఓ సినిమా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement