సినిమా ప్రపంచంలో ప్రియాంకా చోప్రా స్టార్‌డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారీ బ్యూటీ. ఇప్పుడు ప్రియాంకా చోప్రా మైనపు విగ్రహం న్యూయార్క్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఉంది. ఆ బొమ్మతో ప్రియాంక ఫొటో దిగారు. ఇదిలా ఉంటే.. ప్రియాంక మైనపు విగ్రహాన్ని తుస్సాడ్స్ వారు కేవలం న్యూయార్క్‌లోనే కాదు యూకే, ఆస్ట్రేలియా, ఆసియాలో కూడా ఆవిష్కరించనున్నారు. విశేషం ఏంటంటే... ఒక్క ప్రియాంకా చోప్రాకు మాత్రమే నాలుగు మైనపు విగ్రహాలు ఉండబోతున్నాయి. ఇప్పటివరకూ అమెరికన్ నటి, గాయని విట్నే ఎలిజబెత్ హూస్టన్‌కు మాత్రమే మూడు మైనపు విగ్రహాలు ఉన్నాయట. ప్రియాంకవి నాలుగు కావడం విశేషం. ప్రస్తుతం హాలీవుడ్‌లో కీలక పాత్ర చేసిన ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ఉన్న ప్రియాంకా చోప్రా హిందీలో ‘ది స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ ఆమె ఓ హాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల ఆమె భర్త, గాయకుడు నిక్ జోనస్ కూడా ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఇద్దరూ తెరపై కూడా జోడీగా కనిపించే అవకాశం ఉంటుందేమో.
Comments
Please login to add a commentAdd a comment