![Kajal Aggarwal unveils her wax statue at Madame Tussauds - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/6/Kajal-34.jpg.webp?itok=RF06gJjZ)
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ మర్చిపోలేని రోజు ఫిబ్రవరి 5, 2020. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా మారిపోయిన రోజు. సింగపూర్‌లో బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు కాజల్. మేడమ్ తుస్సాడ్స్‌లో సౌత్ నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకున్న తొలి హీరోయిన్ కాజల్ కావడం విశేషం. ‘‘ఈ గుర్తింపుని అందించిన మేడమ్ తుస్సాడ్స్ సంస్థకు ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్సనాలిటీల మధ్య నా మైనపు బొమ్మ కూడా ఉండటం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్.
కాజల్ అగర్వాల్
చెల్లి నిషా అగర్వాల్‌తో...
Comments
Please login to add a commentAdd a comment