Madame Tussauds museum
-
మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్‌కు దక్కిన అరుదైన గౌరవం
ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. అయితే, తాజాగా విగ్రహం కూడా ఆవిష్కరించనున్నారు.సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా వారు పెట్టనున్నారు. ఇప్పటకే అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి అయిదని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద టుస్సాడ్స్ టీమ్ ప్రకటించింది. ఆ వీడియో ఇప్పడు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. టుస్సాడ్స్ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ కొలువుదీరిన విషయం తెలిసిందే.అయితే, మేడమ్ టుస్సాడ్స్ పుట్టిల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్ (బ్యాంకాక్ మ్యూజియం), మహేశ్ బాబు (సింగపూర్), అల్లు అర్జున్ (దుబాయ్)లలో వారి మైనపు విగ్రహాలు ఉన్నాయి.ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్లు.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్రామ్చరణ్- శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.Global Star @AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds Very Soon ! 🔥Announced at #IIFA2024.@MadameTussauds pic.twitter.com/bznYs3SJXL— Trends RamCharan ™ (@TweetRamCharan) September 29, 2024 -
‘నీ యవ్వ తగ్గేదే లే..’.. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (ఫొటోలు)
-
మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం
లండన్: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్‌పూల్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్ సెంటర్ ముందుకు తరలించారు. జాబ్ సెంటర్ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. Blackpool Madame Tussauds have put Boris Johnson’s waxwork outside of the job centre and I can’t stop laughing pic.twitter.com/U6VToQSjo9 — Charlotte (@charlotteclaber) July 7, 2022 నీలిరంగు టైతో కూడిన సూట్లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్ టుస్సాడ్స్. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్‌సెంటర్ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. 'బోరిస్ ఎక్స్ బ్లాక్పూల్' అంటూ నోట్ రాసుకొచ్చింది. బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్ లైవ్ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. -
మైనపు బొమ్మ
కాజల్ అగర్వాల్ మర్చిపోలేని రోజు ఫిబ్రవరి 5, 2020. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా మారిపోయిన రోజు. సింగపూర్‌లో బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు కాజల్. మేడమ్ తుస్సాడ్స్‌లో సౌత్ నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకున్న తొలి హీరోయిన్ కాజల్ కావడం విశేషం. ‘‘ఈ గుర్తింపుని అందించిన మేడమ్ తుస్సాడ్స్ సంస్థకు ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్సనాలిటీల మధ్య నా మైనపు బొమ్మ కూడా ఉండటం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్‌తో... -
తెగ సంబరపడిపోతున్న కాజల్
దక్షిణాదిన హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. 12 ఏళ్ళ కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించింది. రేపు(ఫిబ్రవరి 05) ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో కాజల్ వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్స్‌కి చేరవేసింది. తన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో పెడుతున్నందుకు సంతోషంగా ఉందని, దీనికోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానంటూ ఓ వీడియోని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డార్లింగ్ ప్రభాస్ సరసన చందమామ విగ్రహం కూడా చేరనుండతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోంది. ప్రముఖుల మైనపు విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ మేడమ్ టుస్సాడ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటీనటుల విగ్రహాల్ని ఒకేచోట ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలు ఈపాటికే అక్కడ కొలువుదీరాయి. .@MsKajalAggarwal's Wax Statue at #MadameTussauds is getting unveiled tomorrow.#KajalMadameTussauds#Kajal #KajalAggarwal #MadameTussaudsSG #MTSG@MTsSingapore pic.twitter.com/0oelsEGovc — BARaju (@baraju_SuperHit) February 4, 2020 -
కొత్త దశాబ్దానికి శుభారంభం
పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేటప్పుడు కొత్త ఏడాది అంతా బాగుండాలని కోరుకుంటాం. కాజల్ అగర్వాల్ అలానే కోరుకుంటున్నారు. అయితే రానున్న 2020 గురించి మాత్రమే కాదు.. వచ్చే దశాబ్దం కూడా తనకు బాగుంటుందని ఆమె అంటున్నారు. దానికి కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖుల లిస్ట్‌లో కాజల్ చేరబోతున్నారు. మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఎంతోమంది సెలబ్రిటీల బొమ్మల సరసన కాజల్ మైనపు బొమ్మ చేరబోతోంది. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న తన మైనపు బొమ్మను కాజల్ ఆవిష్కరించనున్నారు. ‘‘నా చిన్నప్పుడు తుస్సాడ్స్ మ్యూజియమ్‌కి వెళ్లి, అక్కడున్న ప్రముఖుల బొమ్మలను ఎంతో ఆరాధనగా చూసేదాన్ని. నా బొమ్మ వారితో పాటు ఉండబోవటం అనేది నాకు దక్కిన గౌరవంలా భావిస్తున్నాను. కొత్త దశాబ్దం శుభారంభానికి ఇది నాంది అనుకుంటున్నాను. నిద్ర లేకుండా ఎంతో కష్టపడి షూటింగ్ చేసిన రాత్రులు, ఎన్నో వ్యక్తిగత త్యాగాలకు దక్కిన ప్రతిఫలంలా భావిస్తున్నా. నా బొమ్మను నా చేతులతో ఆవిష్కరించే రోజు కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు కాజల్ అగర్వాల్. కాజల్ బొమ్మకు కావాల్సిన కొలతలను తుస్సాడ్స్ టీమ్ తీసుకుంది. -
ఫిబ్రవరి నాటికి మరో ‘కాజల్’
చెక్కుచెదరని అందంతో, ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిగే నేర్పుతో ఇప్పటికీ టాప్ హీరోయిన్గా వెలుగులీనుతోంది కాజల్ అగర్వాల్. తాజాగా ఈ అందాల చందమామకు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మ కొలువదీరనుంది. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షణాది హీరోయిన్‌గానూ కాజల్ రికార్డు సృష్టించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డార్లింగ్ ప్రభాస్ సరసన చందమామ విగ్రహం కూడా చేరనుండతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రముఖుల మైనపు విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ మేడమ్ టుస్సాడ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటీనటుల విగ్రహాల్ని ఒకేచోట ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలు ఈపాటికే అక్కడ కొలువుదీరాయి. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ నిపుణులు కాజల్ మైనపు విగ్రహం తయారు చేయడం కోసం ఆమె కొలతలను కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనంలో మేడమ్ టుస్సాడ్ మ్యూజియాన్ని సందర్శించిన కాజల్ అక్కడి విగ్రహాలను చూసి ఎంతగానో ఆశ్యర్యపోయేది, వాటిని ప్రేమించేది. కానీ ఇప్పుడు ఏకంగా వాటి పక్కన తన విగ్రహం ఏర్పాటు కానుండటంతో కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రెండో కాజల్.. అదేనండీ ఆమె మైనపు విగ్రహాన్ని చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం కాజల్ బహుభాషా చిత్రమైన ‘ఇండియన్-2’ లో నటిస్తోంది. -
అందమైనపు బొమ్మ
శ్రీదేవి గొప్ప అందగత్తె. అంతకు మించిన గొప్ప నటి. సౌతిండియా నుంచి నార్తిండియా వరకూ తన ప్రతిభతో లేడీ సూపర్‌స్టార్ అయ్యారు. ఓ బ్రాండ్లా ఎదిగారు. అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి మరణించారు. అందరి మనసుల్లో చెరిగిపోని బొమ్మగా నిలిచిపోయారు. ఇప్పుడు సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అందమైన మైనపు బొమ్మగా మారారు శ్రీదేవి. ఈ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘శ్రీదేవి మరణించిన తర్వాత కూడా ఆమె మీద కురిపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. నా భార్యగా తనని ఎంతగా ప్రేమించానో, తన ఆర్ట్‌ని, తనకు సినిమా మీద ఉన్న ప్రేమను అంతే గౌరవించాను. ఈ విగ్రహం తన ఆనవాళ్లకు ఓ చిహ్నంలా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు బోనీ కపూర్. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటలో శ్రీదేవి లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారు. తల్లి బొమ్మను తదేకంగా చూస్తున్న జాన్వీ శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి -
మహేష్ పక్కనే కరణ్ జోహార్!
భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కించుకోవటం ఓ గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి చాలా మంది తారలు స్థానం దక్కించుకున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ ఏయంబీ సినిమాస్‌లో ఆవిష్కరించిన మహేష్ విగ్రహాన్ని తరువాత సింగపూర్ మ్యూజియంకు తరలించారు. తాజాగా మహేష్ విగ్రహం పక్కనే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కరణ్ తన తల్లితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం చూశానన్న కరణ్.. ఇప్పుడు అదే మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. -
ఎలా ఉన్నావు? అనడుగుతా!
ప్రపంచప్రఖ్యాత మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్‌బాబు కూడా చేరారు. ప్రపంచం నలుమూలలా ఎంతో గొప్ప ఫాలోయింగ్ ఉన్నవారిని సెలెక్ట్ చేసుకొని వారి రూపాల్ని మైనపు బొమ్మలుగా చేసి మ్యూజియంలో ఉంచటం మేడమ్ టుస్సాడ్స్ ప్రత్యేకత. ఇప్పటివరకూ మేడమ్ తుస్సాడ్స్‌లో ఉత్తరాది హీరోలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హీరోయిన్లు కరీనా కపూర్, కత్రినా కైఫ్‌లతో పాటు చాలామంది మైనపువిగ్రహాలు దర్శనమిస్తుంటాయి. తెలుగు స్టార్ ప్రభాస్ బొమ్మ ఆల్రెడీ బ్యాంకాక్ తుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఉంది. ఇప్పుడు మహేశ్‌బాబు. సింగపూర్‌లోని సెంథోసా ఐల్యాండ్‌లో తుస్సాడ్స్ మ్యూజియం మహేశ్ మైనపు విగ్రహాన్ని మరో వారంరోజుల్లో ప్రతిష్టించనున్నారు. ఈ లోపు మహేశ్‌బాబు మైనపు ప్రతిమను సోమవారం హైదరాబాద్‌లో ‘ఏఎంబీ మాల్’లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడమ్ తుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ– ‘‘తుస్సాడ్స్‌లో పెట్టే ఏ విగ్రహాన్నీ వేరే ఎక్కడా ఆవిష్కరించ కుండా నేరుగా మ్యూజియంలోనే పెడతాం. మహేశ్ విగ్రహాన్ని మాత్రమే ముందు ఇక్కడ ఆవిష్కరించటం చాలా ఆనందంగా ఉంది. మహేశ్‌బాబు మైనపు బొమ్మను తయారు చేయటానికి గతేడాది మా టీమ్ ఇండియాకి వచ్చి దాదాపు 200 శరీర కొలతలు తీసుకున్నారు. మహేశ్ కనుగుడ్డు, జుట్టు కొలతలతోపాటు ఆయన శరీర సౌష్టవాన్ని మ్యాచ్ చేయటానికి 20 మంది ఆరు నెలల పాటు శ్రమించారు. మహేశ్ ‘శ్రీమంతుడు’ టైమ్ లుక్‌తో బొమ్మను తయారు చేశాం. ఇండియన్ సూపర్ స్టార్స్ అమితాబ్, షారుక్ ఖాన్ల విగ్రహాల సరసన మహేశ్‌బాబు విగ్రహం ఉంటుంది. మహేశ్‌బాబు కోరిక మేరకు ఆయన అభిమానుల కోసం మేం సింగపూర్ నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాం’’ అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఎంతో మంది ఇండియన్ సూపర్ స్టార్స్ మధ్యలో నేను కూడా భాగమవ్వటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. వీలైనంత త్వరలో నా ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లి నా ప్రతిమను అక్కడ చూసుకోవాలని ఉంది. మొదటిసారి సింగపూర్‌లో నా విగ్రహం పెడుతున్నారు అనే న్యూస్ తెలియగానే ఆ రోజు ఎంతో ఆనందంతో పాటు ఏదో సాధించాననిపించింది. నా కొలతలు ఇచ్చే రోజు వాళ్లు తీసుకున్న డీటైల్స్ చూస్తే నిజంగా నమ్మశక్యం కాలేదు. ముఖ్యంగా శిల్పులు ఇవాన్రీస్, బెన్డానా శ్రమ నిజంగా చాలా గొప్పది. ఆ ప్రాసెస్‌లో కొన్ని విషయాలు చాలా నవ్వు తెప్పించాయి. వాళ్ల దగ్గర ఓ బాక్స్ ఉంది. అందులో చాలా రకాలైన కనుగుడ్లు ఉన్నాయి. వాటిని నా ముఖానికి దగ్గరగా పెట్టి సెలెక్ట్ చేయటం మరచిపోలేను. నా కళ్లు ఎలా చూస్తాయి, జుట్టు టెక్చర్ ఎలా ఉంది? అనేవి చాలా ముఖ్యం. మూడు నెలల క్రితం మా ఆవిడ నమ్రతకు ఫోన్లో పూర్తి అవ్వని బొమ్మ ఫొటో పంపారు. ఆ బొమ్మని నేను ఓ ఇద్దరు స్నేహితులకు చూపిస్తే, ఏదో ఫొటోషూట్ అనుకున్నారు. ఇంతకంటే అందంగా నన్నెవరూ తీర్చిదిద్దలేరు. థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ టీమ్’’ అన్నారు. ‘‘మీ బొమ్మతో మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అని మహేశ్‌ను అడిగితే – ‘‘ఎలా ఉన్నావు? బావున్నా’’ అంటా అన్నారు. అనంతరం తన ప్రతిమలానే పోజిచ్చి ఫొటోలు దిగారు. మహేశ్ భార్య నమ్రత ‘‘ఇద్దరు భర్తలున్నారు’’ అంటే, ‘ఇద్దరు మహేశ్లున్నారని ఆవిడ మాటలకు అర్థం’’ అని మహేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్, నమ్రతల కుమారుడు గౌతమ్. కుమార్తె సితారలతోపాటు దర్శకుడు మెహర్ రమేశ్, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ నారాయణ్‌దాస్ నారంగ్, సునిల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మతో బొమ్మలా... -
గచ్చిబౌలిలో మహేష్ మైనపు విగ్రహం
-
ఫొటోలు దిగి మురిసిపోయిన సన్నీ లియోన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మంగళవారం సన్నీ మైనపు విగ్రహం కొలువుదీరింది. విశేషంగా సన్నీ మైనపు విగ్రహాన్ని ఆమే అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త డానియల్ వెబర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన మైనపు విగ్రహంతో ఫొటోలు దిగుతూ మురిసిపోయారు. గతంలో అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లి, షారుక్ ఖాన్, అనిల్ కపూర్ వంటి ప్రముఖల మైనపు విగ్రహాలు ఇక్కడ కొలువుదీరిన సంగతి తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఉంచడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా విగ్రహానికి సరైన ఆకృతి తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. వారి కష్టాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ గొప్ప గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాన’ని తెలిపారు. ఆమె భర్త డెనియల్ వెబర్ కూడా దీనిపై తన ఆనందాన్ని ట్విటర్లో వ్యక్తం చేశారు. సన్నీ మైనపు విగ్రహాంతో తాను దిగిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు సన్నీతో సెల్ఫీ దిగాలంటే ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియం వెళితే సరిపోతుందంటూ.. నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే సన్నీ జీవితం ఆధారంగా తెరకెక్కిన కరణ్‌జిత్ కౌర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
మాధురీ, కరీనాల సరసన దీపిక
అందం, అభినయం, అదృష్టం ఈ మూడింటి కలబోతే దీపికా పదుకోన్. వరుస విజయాలతో ఇటు బాలీవుడ్లోనే కాక హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ ‘మస్తాని’కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్, న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు లండన్‌లో దీపికాను కలిసి ఆమె కొలతలు, ఫొటోలను తీసుకున్నారు. ఈ సందర్భంగా దీపికా లండన్‌లోని ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. ‘ఈ ఫీలింగ్‌ను మాటాల్లో చెప్పలేను. చాలా ఆతృతగానే కాక సంతోషంగా కూడా ఉంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇలాంటి గౌరవం పొంది అభిమానుల సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా’నన్నారు. అంతేకాక ‘లండన్‌లోని ఈ మ్యూజియాన్ని నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా’ అని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో దీపికా ‘పద్మావత్’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. రాజ్‌పుత్ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికకు జోడిగా ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం. -
అనుష్క శర్మకు అరుదైన గౌరవం
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఓప్రా విన్ఫ్రే, పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్ హామిల్టన్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల మధ్య ఆమె మైనపు విగ్రహం కొలువు తీరనుంది. అయితే గతంలో ఇక్కడ ఉన్న మైనపు బొమ్మలకు, అనుష్క మైనపు విగ్రహానికి ఓ వ్యత్యాసం ఉందట. ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మాట్లాడే అనుష్క మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇక్కడ కొలువుతీరిన మైనపు బొమ్మలతో ఆయా సెలబ్రిటీల అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. అయితే అనుష్క ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన సెలబ్రిటీతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అనుష్క మైనపు బొమ్మకు వద్ద ఏర్పాటు చేసిన ఫోన్‌ను పట్టుకుంటే అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంది. ప్రపంచంలో మరే ఇతర సెలబ్రిటీకి దక్కని అరుదైన గౌరవం తమ అభిమాన నటికి సింగపూర్‌లో దక్కిందన్న విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క మైనపు విగ్రహంపై టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ.. చాలా మంది అతిథులు, అభిమానులు, ఔత్సాహికులు ఇక్కడికి తరచుగా వస్తుంటారు. అనుష్క శర్మ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కోరిక మేరకు, అనుష్కకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మాట్లాడే మైనపు బొమ్మను ఏర్పాటు చేసి ఆమెను గౌరవించాలని భావించినట్లు వివరించారు. -
సచిన్, షారూఖే కాదు.. ఇక రాందేవ్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: యోగా విన్యాసాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా మరో విశేషాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను ఉంచే లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రాందేవ్ బాబా మైనపు బొమ్మ త్వరలో కొలువు దీరనుంది. తద్వారా ప్రముఖ సెలబ్రిటీలు, లెజెండ్స్ సరసన ఈ యోగా గురూ కూడా చేరనున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి యోగా గురువుగా కూడా అవతరించనున్నారు. ఈ విషయాన్ని రాందేవ్ బాబా ట్విటర్లో షేర్ చేశారు. ట్రీ పోజ్(వ్రికాసన) యోగ ఆసనంలో ఆయన మైనపు బొమ్మ రూపకల్పనకు రంగం సిద్ధమైంది. దాదాపు 20మంది నిపుణులు ఇప్పటికే ఈ పనిలో బిజీగా ఉన్నారు. కళ్లు, చెవులు, తల, ఆయన రంగు తదితర వివరాలను సేకరిస్తున్నారు. యోగా, ఆయుర్వేదం రెండూ ప్రపంచానికి లభించిన అతిపెద్ద బహుమతులని ఆయన పేర్కొన్నారు. భారతీయ యోగా, ఆధ్యాత్మికతకు ఇలాంటి గుర్తింపు దొరకడం గర్వకారణమని, తన మైనపు బొమ్మను మ్యూజియంలో పెట్టడం ద్వారా యోగా శాస్త్ర కీర్తి మరింత విశ్వవ్యాప్తవుతుందని చెప్పారు. అలాగే యోగా జీవనశైలిని అనుసరించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇది మరింత ప్రోత్సహిస్తుందన్నారు. తన ప్రతిమను పెట్టాలన్న ప్రతిపాదన రెండు నెలల క్రితమే వచ్చిందని, బాగా ఆలోచించి అంగీకారం తెలిపానని రాందేవ్ తెలిపారు. కాగా తన ఆయుర్వేద ఉత్పత్తులతో పతంజలి సంస్థ నెస్లే, కోల్గేట్ ప్రోక్టర్ అండ్ గాంబుల్, హిందూస్తాన్ యూనీలీవర్ వంటి విదేశీ రిటైల్ కంపెనీలను ఇప్పటికే భారీగా దెబ్బ కొట్టింది. 2017 నాటికి పతంజలి వార్షిక టర్నోవర్ 10,000 కోట్ల మార్కును దాటేసింది. దీంతో పతంజలి సీఈవో బాలకృష్ణ భారీ సంపదతో ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో చేరారు. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ వెర్షన్ ‘పరిధాన్’ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. You will see @yogrishiramdev in #Vrikshasan (Tree pose yog) in @MadameTussauds in whose studio today, a dedicated team of 20 experts took impressions, measurements & matching of eyes, ears, skull & posture by colour, size and recorded details for making wax statue @ANI @AP pic.twitter.com/ok8VOsZz2G — tijarawala sk (@tijarawala) June 25, 2018 -
కదిలి వస్తున్న మైనపు బొమ్మలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలను తయారు చేసే మేడమ్ టస్సాడ్స్ మ్యూజియం భారత్‌లో ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్‌కల్లా మ్యూజియాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు మాతృ సంస్థ మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే కనాట్‌ప్లేస్ ప్రాంతంలోని రీగల్ థియేటర్లోని రెండు అంతస్థులలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేస్తారు. రాబోయే పదేళ్లలో 418 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనున్నట్లు మెర్లిన్ అధికార ప్రతినిధి మార్కెల్ క్లూస్ తెలిపారు. తొలుత దాదాపు 50 మంది సెలబ్రిటీల బొమ్మలతో ఏర్పాటు కానున్న ఈ మ్యూజియంలో 60 శాతం బొమ్మలు స్థానిక సెలబ్రిటీలవి కాగా 40 శాతం అంతర్జాతీయ ప్రముఖులవి ఉండనున్నాయి. బ్రిటన్‌కు చెందిన మెర్లిన్ ఎంటర్టైనర్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాల్లో 116 మ్యూజియాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఇండియా అధికార ప్రతినిధి అన్షుల్ జైన్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో లెగో ల్యాండ్, సీ లైఫ్ వంటి ప్రత్యేక ఆకర్షణలను కూడా భారత్‌కు తీసుకువస్తామని తెలిపారు.ఈ మైనపు బొమ్మలను ఒక్కొక్కదాన్ని తయారుచేయడానికి రూ.1.50 కోట్లు ఖర్చవుతాయని ఆయన అన్నారు. ఇండియాలో ఏర్పాటు చేయనున్న ఈ మ్యూజియంతో ఆసియాలో వీటి సంఖ్య 9కి చేరుకోనుంది. లండన్‌లోని మ్యూజియం ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే భారత్‌కు చెందిన అమితాబ్, ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్, హృతిక్ రోషన్, షారుఖ్‌ఖాన్ మైనపు బొమ్మలు ఉన్న విషయం తెలిసిందే. -
మోదీనే కాదండి.. కేజ్రీవాల్ కూడా!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ నినాదంతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుల కోసం పోరాడే చాంపియన్ గా కేజ్రీవాల్ ను ఆయన అభిమానులు కీర్తిస్తారు. అయితే, త్వరలోనే ఆయన లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో వీవీఐపీల సరసన నిలువబోతున్నారు. ఇప్పటికే మేడం టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మలుగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలో చేరనుంది. అచ్చం మోదీలా రూపురేఖలు, హవాభావాలున్న ఈ మైనపు బొమ్మకు ఇటీవల తుది మెరుగులు దిద్దుతూ దింపిన ఫొటోలు బాగా హల్ చల్ చేశాయి. నిజంగా మోదీనే చూస్తున్న భావన కల్పించాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలోకి చేరనుంది. అచ్చం తనలాగే ఉండే ఈ బొమ్మ రూపకల్పన కోసం కొలతలు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఒప్పుకొన్నారని, వచ్చేనెలలో కొలతలు తీసుకుంటారని కేజ్రీవాల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మఫ్లర్ తో పోజిస్తారా? కామన్ మ్యాన్ ప్రతీకగా తనను తాను భావించుకునే అరవింద్ కేజ్రీవాల్ అనగానే చాలామందికి ఆయన మఫ్లర్ గుర్తుకొస్తుంది. ఢిల్లీలోని చలి వాతావరణం తట్టుకోవడానికి ఆయన తరచూ మఫ్లర్ ధరించి కనిపించేవారు. తన ఇంటిలో సీబీఐ దాడులు జరిపితే మఫ్లర్లే ఎక్కువగా దొరుతాయని కేజ్రీవాల్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఈ నేపథ్యంలో మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టే మైనపు బొమ్మకు కూడా మఫ్లర్ ఉంటుందా? మోదీ, కేజ్రీవాల్ పోటాపోటీగా ఈ మ్యూజియంలో కొలువైతే.. ఎవరితో ఎక్కువగా సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీపడతారు? అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అన్నట్టు వచ్చే ఏడాది ఢిల్లీలో కూడా తన శాఖను ఏర్పాటుచేయాలని మేడం టుస్సాడ్ మ్యూజియం భావిస్తోంది. -
టుస్సాడ్స్ మ్యూజియంలో మోదీ మైనపు బొమ్మ
లండన్: ప్రపంచ ప్రముఖులకు దక్కిన అరుదైన గౌరవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అందుకోనున్నారు. లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మోదీ మైనపు బొమ్మను ఉంచనున్నట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు. ప్రపంచ రాజకీయాల్లో మోదీ ప్రముఖంగా, ప్రత్యేకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది ప్రారంభంలో తనతో చర్చించేందుకు టుస్సాడ్స్ కళాకారులు, నిపుణుల బృందానికి మోదీ సమయమిచ్చారని తెలిపారు. బుధవారం ఢిల్లీలో నిపుణులు మోదీ కొలతలు తీసుకున్నారు. ‘ప్రపంచంలోని ప్రముఖుల సరసన నా బొమ్మ పెట్టేంత గౌరవం నాకుందా? అనిపించింది. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని టుస్సాడ్స్ టీం తెలిపింది. గతంలో మూడు నాలుగు సార్లు.. ఈ మ్యూజియాన్ని సందర్శించాను. ప్రముఖుల బొమ్మల పక్కన నిలబడి ఫొటోలు కూడా తీసుకున్నాను’ అని మ్యూజియంకు ఇచ్చిన ప్రకటనలో మోదీ పేర్కొన్నారు. -
మాధురీ విత్ మాధురీ
నైపుణ్యం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం... పేరు వినగానే మైనపుశిల్పాలు కళ్లముందు మెదలుతాయి. లండన్‌లో ఉన్న ఈ మ్యూజియానికి ఆమ్స్టర్డామ్, బ్యాంకాక్, సిడ్నీ, హాంగ్‌కాంగ్, టోక్యో, లాస్‌వేగాస్, ఆర్లాండో, శాన్ఫ్రాన్సిస్కో, షాంఘై, బీజింగ్, సింగపూర్, బెర్లిన్, ప్రేగ్, వియన్నా,వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, హాలీవుడ్‌లలో శాఖలు ఉన్నాయి. ⇒ ఒక మైనపు శిల్పాన్ని తయారు చేయడానికి సుమారు నాలుగు నెలలు పడుతుంది. మనిషిని 250 కొలతలు తీసుకుంటారు. రకరకాల భంగిమల్లో ఉన్న ఫొటోలను పరిశీలిస్తూ శిల్పాన్ని తయారు చేస్తారు. వ్యక్తి జీవించి లేకపోతే ఆ వ్యక్తి వందల ఫొటోలను నిశితంగా పరిశీలించి పని మొదలు పెడతారు. ⇒ ప్రతి వెంట్రుకను విడిగా నాటుతారు. ఇందుకు ఐదు వారాలు పడుతుంది. ⇒ కంటిలోని ఎర్రజీరల కోసం ఎర్రటి పట్టుదారాలను ఉపయోగిస్తారు. దేహంలో రక్తనాళాలు ఉబ్బెత్తుగా అనిపించడానికి దారానికి ముడులు వేసి అమరుస్తారు. ⇒ మ్యూజియం నిబంధనలు కచ్చితంగా ఉంటాయి. మైనపు శిల్పం తయారీకి తీసుకున్న వ్యక్తుల దేహ కొలతలను వెలిబుచ్చరు. అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఠి ప్రతి రోజూ రెండు మెయింటెనెన్స్ టీమ్‌లు ప్రతి మైనపు శిల్పాన్నీ పరిశీలించి అంతా బాగుందని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు. ⇒ మైనపు శిల్పాలకు క్రమం తప్పకుండా షాంపూ చేయించి, దుస్తులు తొడగడంతోపాటు నెయిల్ పాలిష్ తుడిచి కొత్తది వేస్తారు. ⇒ ఒక్కో మైనపు శిల్పం తయారీకి నూటపాతిక డాలర్లు ఖర్చవుతుంది. మైనపు శిల్పాల తయారీలో ఎక్స్పర్ట్ అయిన మ్యారీ టుస్సాడ్స్ పేరుతో ఈ మ్యూజియానికి ‘మేడమ్ టుస్సాడ్స్’ అనే పేరు వాడుకలోకి వచ్చేసింది. మ్యారీ తన పదహారవ యేట తొలి మైనపు శిల్పాన్ని చేశారు. ఒకానొక పరిస్థితిలో ఆమెకు చనిపోయిన వారి మాస్కులు తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రపంచదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అనేక కళాఖండాలను రూపొందించారు. వాటితో ప్రదర్శన ఏర్పాటు చేశారు. టుస్సాడ్స్ మ్యూజియం లండన్‌లో ప్రధానమైన టూరిస్ట్ అట్రాక్షన్స్‌లో ఒకటి. ఇప్పుడు మ్యూజియాన్ని మెర్లిన్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ మ్యూజియంలో వేలాది శిల్పాలున్నాయి. ప్రముఖ నటీనటులు, నాయకులు, క్రీడాకారులు, రచయితలు, సంగీతకారుల శిల్పాలున్నాయి. ఇందులో అడాల్ఫ్ హిట్లర్, ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్, ద బీటిల్స్, ప్రిన్స్ చార్లెస్- కెమిల్లా దంపతులు, చార్లీ చాప్లిన్, రెండవ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్, పోప్‌జాన్‌పాల్, ప్రిన్సెస్ డయానా, మార్లిన్‌మన్రో, నెల్సన్మండేలా వంటి ప్రపంచ ప్రముఖులతోపాటు మనదేశానికి చెందిన మహాత్మాగాంధీ, కరీనా, అమితాబ్, ఐశ్వర్యారాయ్, మాధురీదీక్షిత్, సల్మాన్‌ఖాన్ వంటి వారి మైనపు శిల్పాలున్నాయి. అలాగే మ్యారీ టుస్సాడ్స్ శిల్పం కూడా. ఈ మ్యూజియాన్ని ఏడాదికి ఐదొందల మిలియన్ల మంది సందర్శిస్తారు. వీరిలో ఎక్కువ మంది నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాల నుంచే వస్తారు. -
కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్‌లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్‌లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు. ఎక్కువ శాతం ఓట్లు సంపాదించుకున్న ప్రముఖుల బొమ్మలు తయారు చేయించి, వారి చేతుల మీదగానే ఆవిష్కరింపజేస్తారు. అలా ఇప్పటివరకూ హిందీ రంగానికి చెందిన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్‌ల మైనపు బొమ్మలు ఆ మ్యూజియమ్‌లో కొలువుదీరాయి. తాజాగా, ఈ ఏడుగురి చెంత కత్రినా కైఫ్ చేరారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్.. ఈ ముగ్గురిలో ఎవరి బొమ్మ పెడితే బాగుంటుందనే విషయంపై మేడమ్ టుస్సాడ్స్‌వారు ఓటింగ్ పెడితే, అందరికన్నా ఎక్కువ ఓట్లు కత్రినాకి పడ్డాయి. ఈ బ్యూటీకి 2 లక్షల 25వేల ఓట్లు పడ్డాయట. దాంతో ఈవిడగారి మైనపు బొమ్మ తయారు చేయించడానికి టుస్సాడ్స్ మ్యూజియమ్‌వాళ్లు రంగంలోకి దిగారు. కత్రినాకి విషయం చెప్పి, ఆమె అనుమతితో శరీర కొలతలు తీసుకున్నారు. ఆ కొలతల ప్రకారం ప్రపంచ ప్రఖ్యాత శిల్పులతో కత్రినా మైనపు బొమ్మ తయారు చేయించారు. నాలుగు నెలలు శ్రమించి, తయారు చేసిన ఈ బొమ్మకు అయిన ఖర్చు కోటీ 40 లక్షల రూపాయలని సమాచారం. ఈ బొమ్మను సిల్వర్ కలర్ గాగ్రా, పింక్ రంగు చున్నీతో అలంకరించారు.