
భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కించుకోవటం ఓ గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి చాలా మంది తారలు స్థానం దక్కించుకున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
హైదరాబాద్ ఏయంబీ సినిమాస్‌లో ఆవిష్కరించిన మహేష్ విగ్రహాన్ని తరువాత సింగపూర్ మ్యూజియంకు తరలించారు. తాజాగా మహేష్ విగ్రహం పక్కనే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కరణ్ తన తల్లితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం చూశానన్న కరణ్.. ఇప్పుడు అదే మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment