మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌ చరణ్‌కు దక్కిన అరుదైన గౌరవం | Ram Charan Wax Statue Will Be Installed At Madame Tussauds Museum, Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌ చరణ్‌కు దక్కిన గౌరవం

Sep 29 2024 1:17 PM | Updated on Sep 29 2024 2:33 PM

Ram Charan Have Wax Statue Madame Tussauds Museum

ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. అయితే, తాజాగా విగ్రహం కూడా ఆవిష్కరించనున్నారు.

సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా వారు పెట్టనున్నారు. ఇప్పటకే అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి అయిదని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద టుస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. ఆ వీడియో ఇప్పడు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. టుస్సాడ్స్‌ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో  గౌరవంగా భావిస్తున్నట్లు చరణ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే స్టార్‌ హీరోలు ప్రభాస్‌‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌ కొలువుదీరిన విషయం తెలిసిందే.

అయితే, మేడమ్ టుస్సాడ్స్ పుట్టిల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్‌  (బ్యాంకాక్‌ మ్యూజియం), మహేశ్‌ బాబు (సింగపూర్‌), అల్లు అర్జున్‌ (దుబాయ్‌)లలో వారి మైనపు విగ్రహాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్లు‌‌.. బాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్‌

రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో గేమ్‌ ఛేంజర్‌ సినిమా తెరకెక్కుతుంది. క్రిస్మస్‌ సందర్భంగా 'గేమ్ ఛేంజ‌ర్‌' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement