ఫిబ్రవరి నాటికి మరో ‘కాజల్‌’ | Kajal Aggarwal Statue In Madame Tussauds | Sakshi
Sakshi News home page

మ్యూజియంలో చందమామ..

Published Tue, Dec 17 2019 7:15 PM | Last Updated on Tue, Dec 17 2019 8:03 PM

Kajal Aggarwal Statue In Madame Tussauds - Sakshi

చెక్కుచెదరని అందంతో, ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిగే నేర్పుతో ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌గా వెలుగులీనుతోంది కాజల్‌ అగర్వాల్‌. తాజాగా ఈ అందాల చందమామకు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాజల్‌ మైనపు బొమ్మ కొలువదీరనుంది. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షణాది హీరోయిన్‌గానూ కాజల్‌ రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, డార్లింగ్‌ ప్రభాస్‌ సరసన చందమామ విగ్రహం కూడా చేరనుండతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రముఖుల మైనపు విగ్రహాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మేడమ్‌ టుస్సాడ్‌. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటీనటుల విగ్రహాల్ని ఒకేచోట ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ విగ్రహాలు ఈపాటికే అక్కడ కొలువుదీరాయి. తాజాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ నిపుణులు కాజల్‌ మైనపు విగ్రహం తయారు చేయడం కోసం ఆమె కొలతలను కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

చిన్నతనంలో మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియాన్ని సందర్శించిన కాజల్‌ అక్కడి విగ్రహాలను చూసి ఎంతగానో ఆశ్యర్యపోయేది, వాటిని ప్రేమించేది. కానీ ఇప్పుడు ఏకంగా వాటి పక్కన తన విగ్రహం ఏర్పాటు కానుండటంతో కాజల్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రెండో కాజల్.. అదేనండీ ఆమె మైనపు విగ్రహాన్ని చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం కాజల్‌ బహుభాషా చిత్రమైన ‘ఇండియన్‌-2’ లో నటిస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement