వ్యాక్స్ ఫిక్స్!
ఎందుకో హిందీ గుమ్మ సోనాక్షి సిన్హా మనసు ఉన్నట్టుండి ‘మైనపు బొమ్మ’ పైకి మళ్లింది. ఇటీవలే సెక్సీ తార కత్రినా కైఫ్ వ్యాక్స్ స్టాట్యూను లండన్‌లోని మ్యాడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బహుశా ఇది చూసి మనసు పారేసుకుందో... లేదంటే తనకేం తక్కువనుకుందో... మొత్తానికి మ్యాడమ్ టుస్సాడ్స్‌లో ఈ మేడమ్ స్టాట్యూ ఉండాల్సిందేనంటోంది. ఏదో ఒక రోజు తన కల నెరవేరుతుందని ఆశిస్తోంది.
ప్రతిష్టాత్మకమైన ఈ మ్యూజియంలో కత్రినా ప్రతిమ పెట్టడంపై సోనాక్షి సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటికే అక్కడ బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచన్, ఐశ్వర్యారాయ్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురి దీక్షిత్‌ల బొమ్మలు కొలువుదీరాయి. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకుని లాంగ్ రన్ చేసినవారి బొమ్మలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. నిజంగా ఇది వారి ప్రతిభకు దక్కిన గౌరవం. కత్రినలా... నా బొమ్మా టుస్సాడ్స్‌లో ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అంది సోనాక్షి.