‘పెర్ఫార్మెన్స్’ పాత్రలకు రెడీ..
హీరోల పక్కన స్టెప్పులు, డ్యూయెట్లకు మాత్రమే పరిమితమయ్యే గ్లామర్ పాత్రలకే కాదు, నటనకు అవకాశం ఉన్న పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకూ తాను సిద్ధమేనంటోందని సోనాక్షి సిన్హా. ‘దబాంగ్’, ‘రౌడీ రాథోడ్’, ‘యాక్షన్ జాక్సన్’ వంటి బ్లాక్‌బస్టర్స్ సహా పలు చిత్రాల్లో సోనాక్షి గ్లామర్ పాత్రలనే పోషించింది. అయితే, ‘లుటేరా’ చిత్రం ఇందుకు మినహాయింపు. నటనలో పరిణతి ప్రదర్శించాల్సిన దశకు చేరుకున్నాననే భావిస్తున్నానని, 2015లో మురుగదాస్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నానని సోనాక్షి చెబుతోంది.