
నాకా భయం లేదు!
‘దబాంగ్’లాంటి మెగా హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా... ఆ తరువాత చెప్పుకో తగ్గ ఆఫర్లు లేవనే చెప్పాలి సోనాక్షి సిన్హాకు. అందుకే రూటు మార్చి ఇద్దరు ముగ్గురు ఫిమేల్ స్టార్స్ ఉన్న సినిమాల్లో కూడా చేస్తోందని బీ టౌన్‌లో గుసగుస. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడిగితే... ‘మల్టీ స్టారర్ సినిమాలో చేయడం ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నా. ఇప్పటికే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. కెరీర్ గురించి నాకెలాంటి అభద్రతా భావం లేదు. అజయ్‌దేవ్‌గణ్‌తో చేస్తున్న యాక్షన్ జాక్సన్‌లో రోల్ నచ్చింది. సో... హీరోయిన్లు ఎంతమంది ఉన్నారన్నది సమస్య కాదు’ అంది సోనాక్షి.