Multi-Starrer Film
-
అడవుల్లో వంద రోజులు!
రాజుల ఆహార్యం గొప్పగా ఉంటుంది. అందుకే రాజుల కథలతో వచ్చే సినిమాల కోసం హీరోలు తమ లుక్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళ హీరోలు విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి తమ లుక్స్‌ను మార్చుకోబోతున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంతో కూడుకున్న నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్ నటించనున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్, కీర్తి సురేష్, అమలాపాల్ ప్రధాన పాత్రధారులనే ప్రచారం జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, మోహన్‌బాబు కూడా కీలక పాత్రలు చేయనున్నారని కోలీవుడ్ టాక్. సినిమాలోని రాజుల పాత్రకు తగ్గట్లు జుట్టు మీసాలు, గెడ్డాలు పెంచుకోమని మణిరత్నం ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారులకు చెప్పారట. ఆల్రెడీ విక్రమ్, కార్తీ వంటి నటులు ఈ పని స్టార్ట్ చేశారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ నవంబరులో మొదలు కానుందని తెలిసింది. ముందుగా థాయ్‌ల్యాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట టీమ్. వంద రోజుల పాటు అక్కడి అడవుల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలిసింది. -
నడిగర్‌సంఘ నిధి కోసం మల్టీ స్టారర్ చిత్రం
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) భవన నిర్మాణం కోసం ఈ సంఘం కార్యదర్శి విశాల్,కోశాధికారి కార్తీ కలిసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం.ఆ మధ్య జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలను గెలిచి సంఘ బాధ్యతలను చేపట్టిన కార్యవర్గం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. నాజర్, విశాల్,కార్తీల వర్గం చేసిన వాగ్ధానాల్లో ప్రధానమైనది సంఘ భవన నిర్మాణం. స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులో సంఘానికి చెందిన 19 గ్రౌండ్ల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాలని తీర్మానం చేశారు. దాన్ని ఇప్పుడు నెరవేర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ భవనంలో వెయ్యి మంది కూర్చునే విధంగా ఒక ప్రాంగణం, కల్యాణ మండపం, ప్రివ్యూ థియేటర్, ఇక సమావేశ వేదిక, వ్యాయామ గది,నృత్య శిక్షణ హాలు,సంఘ కార్యాలయం వంటివి నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.29 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇటీవల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్స్ క్రికెట్ క్రీడా కార్యక్రమం ద్వారా రూ.9 కోట్ల నిధిని రాబట్టారు. మిగిలిన నిధి కోసం రెండు చిత్రాలను నిర్మించనున్నారు. ఇందు కోసం ముగ్గురు దర్శకుల నుంచి కథలు విన్నారట. అందులో ఒక కథ సంఘ నిర్వాహకులకు బాగా నచ్చిందని సమాచారం. ఆ కథలో విశాల్, కార్తీ నటించనున్నారని తెలిసింది. వారి పారితోషికాలు సంఘం నిధికే చేరతాయట. ఈ చిత్రాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ చిత్రం ద్వారా సుమారు రూ.25 కోట్ల రూపాయలు సంఘం నిధికి వస్తాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మరో చిత్రం కూడా నిర్మించనున్నారట. అందులో ఆర్య, జయంరవి హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. సంఘం భవన నిర్మాణాన్ని ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తునట్లు, ఈ నెల 10వ తేదీన జరుగనున్న కార్యవర్గ సమావేశంలో పైన చెప్పిన అంశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం. -
మల్టీ స్టారర్ చిత్రానికి ముహూర్తం
ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమ భిన్న చిత్రాల మయంగా మారింది. ఒక పక్క హారర్ చిత్రాల దాడి కొనసాగుతోంది. మరో పక్క 2.ఓ లాంటి బ్రహ్మాండ చిత్రాల రూపకల్పన, ఇంకో పక్క హీరోల ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయంతో మంచి కమర్షియల్ చిత్రాల నిర్మాణాలు తెరకెక్కుతున్నాయి.అలాంటి వాటికి మధ్య తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రం ఆరంభం కానుంది. అదే యువ నటులు ఉదయనిధిస్టాలిన్, విష్ణువిశాల్ కలసి నటించనున్న చిత్రం.సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మన్మదన్ అండు,7ఆమ్ అరివు,ఒరుకల్ ఒరు కన్నాడి వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉదయనిధిస్టాలిన్ రెడ్‌జెయింట్ సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రం ఇది. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మలయాళ కుట్టి మంజిమా మోహన్ నటిస్తోంది. ఈమె ఇప్పటికే శింబుతో అచ్చం ఎంబది మడమయడా చిత్రంలో నటించిందన్నది గమనార్హం. విష్ణువిశాల్‌తో మేఘా ఆకాశ్ రొమాన్స్ చేయనుంది. ఈ అమ్మడు ఇప్పటికే బాలాజీ ధరణీ ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఒరు పక్క కథై చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది.దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, మది చాయాగ్రహణం, కాశీవిశ్వనాథన్ కూర్పు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మంచి కథ లభిస్తే ఉదయనిధిస్టాలిన్‌తో చేయాలన్న ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరుతోందని దర్శకుడు సుశీంద్రన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మనసుతో చూడాల్సిన సినిమా ఇది : ప్రకాశ్‌రాజ్
‘‘నాగార్జున, కార్తీ, తమన్నా, వంశీ వీళ్లందరిని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. ‘ఊపిరి’ సినిమా ఎంచుకోవడంలో వాళ్ల వ్యక్తిత్వాలు క నిపిస్తున్నాయి. మన మనసుతో చూడాల్సిన సినిమా ఇది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం - ‘ఊపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి పతాకంపై పెరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం పాటల విడుదల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. గోపీసుందర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నాగార్జున సతీమణి అమల అక్కినేని ఆవిష్కరించారు. ప్రకాశ్‌రాజ్ ఇంకా మాట్లాడుతూ, ‘‘నాగ్‌లో తాను ఎదగడమే కాక, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తారు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన అంశం. ఇక, మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన కార్తీ ఆ రోజుల నుంచీ నాకు తెలుసు. అతను సినిమాలు ఎంచుకొనే విధానం బాగుంటుంది. కమర్షియల్ పంథా చిత్రాలూ తీస్తూ వచ్చిన దర్శకుడు వంశీ ఇలాంటి సినిమాతో కొత్తగా కనిపిస్తాడు. ప్రతి మనిషీ నేర్చుకుంటూ ఉండాలి. ఈ సినిమాతో వంశీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. మన పరిశ్రమకు ఇలాంటి దర్శకులు కావాలి’’ అని పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ-‘‘మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఊపిరి . మా అబ్బాయి నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఆ టైటిల్ నాకు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇష్టం. చాలామంది నిరుత్సాహపరిచినా, ఆ సాహసంతోనే ‘గీతాంజలి’, ‘శివ’, ‘అన్నమయ్య’ చేశా. ఇప్పుడీ సినిమా. నేను, అమల చాలాకాలం క్రితం ఈ చిత్రం ఒరిజినల్ చూశాం. ఇది ఎవరైనా చేస్తే బాగుంటుందనుకున్నాం. అలా అనుకున్న మూడేళ్ల తర్వాత నాకీ సినిమా కథ చెప్పాడు వంశీ. వెంటనే ఓకే చెప్పా. నేనేదో వీల్‌చైర్‌లో కూర్కొన్నానని అనుకోవద్దు. కాళ్లూ, చేతులు పడిపోయినా పరిగె త్తుతూనే ఉంటాను. మనిషికి కావాల్సింది తోడు. కష్టాల్లో, నవ్వుల్లో తోడు కావాలనిపిస్తుంది. ఎంత సంపాదించుకున్నా తోడు లేకపోతే ఆ డబ్బునంతా నెత్తికేసి కొట్టుకోవాల్సిందే. నాకు ఈ సినిమాలో తోడు కార్తీ. అతణ్ణి మంచి నటుడనే కన్నా, నా ఫ్రెండ్ అని చెబుతాను. ఈ సినిమాతో నాకొక ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా వద్దని చెప్పడానికి నాకు రీజన్స్ దొరకలేదు. ఓ హాలీవుడ్ క్లాసిక్‌కు వంశీ మన నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడు. ప్రతి సన్నివేశంలో ఏడుస్తాం, మళ్లీ వెంటనే నవ్వుతాం. అలా రాయడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచి నాకు నాగార్జున గారంటే చాలా ఇష్టం. మా అమ్మగారు నాగ్ గారికి ఫ్యాన్. జీవితంలోని ప్రతి సెకనూ ఎంత విలువైనదో చెప్పాం. ప్రత్యేకంగా ఓ సన్నివేశంలో నాగార్జున ఏడిపించారు. చూస్తున్నవాళ్లం మేమూ ఏడ్చేశాం’’ అని కార్తీ చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ- ‘‘రెండేళ్ల జర్నీలో నన్ను నేను అన్వేషించుకుంటున్న సమయంలో వీళ్లకు ‘ఇన్టచ్బుల్స్’ కథ చెప్పాను. చాలా భయం భయంగా చెప్పాను. నాగార్జున, కార్తీ, పీవీపీ నన్ను నమ్మారు. వీళ్లు ప్రతి క్షణం నాకిస్తున్న సపోర్ట్‌కు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను! ఈ సినిమా చేస్తున్నందుకు కాదు. ముందు వీళ్ళ నమ్మకానికే భయపడ్డాను. మనం జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వీల్ చెయిర్లో కూర్చుంటాం. అలాంటి టైమ్‌లోనే మనకు ఫ్రెండ్, అమ్మ, నాన్న, ఎవరో ఒకరు తోడుగా నిలుస్తారు. అదే ఈ సినిమా. ప్రకాశ్ రాజ్‌గారి పాత్ర ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుంది. ఆయన మన సినీ పరిశ్రమకు ఓ వరం. మా యూనిట్ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్’’ అని అన్నారు.ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ అంతా నాకు తెలుసు. ఈ వేసవిలో ఇది సూపర్ హిట్ అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో దర్శకులు రాఘవేంద్రరావు, దశరథ్, అశ్వనీదత్, హీరోలు సుమంత్, సుశాంత్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
విక్రమ్, సూర్య, కార్తీలతో మల్టీస్టారర్ చిత్రం
విక్రమ్, సూర్య, కార్తీ నటించే భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. వివరాల్లోకెళితే హాలీవుడ్లో వారియర్స్ పేరుతో తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో పునర్నిర్మిస్తున్నారు. అక్షయకుమార్, సిద్ధార్ధ్ మల్హోత్రా, జాకీష్రాఫ్ ప్రదాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో విక్రమ్, సూర్య, కార్తీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇక తెలుగులో ప్రభాస్,రామ్‌చరణ్, రాణాలను నటింప జేయడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం.అత్యంత భారీ బడ్జెట్లో రూపిందనున్న ఈ చిత్రానికి శంకర్ లాంటి స్టార్ దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.ఇద్దరు సహోదరులు ఒక బాక్సింగ్ శిక్షకుడి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ క్రేజీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంచెం రోజులు ఆగాల్సిందే. -
అందాలారబోత నా అభిమతం కాదు
అందాలారబోతన్నది తన అభిమతం కాదంటున్నారు నటి తమన్న. మోతాదుకు మించి తడిపొడి అందాలతో కనువిందు చేసే హీరోయిన్ల జాబితాలో ముందుండే నటి తమన్న అన్న విషయాన్ని పైయ్యా లాంటి చిత్రాలు చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీరం లాంటి చిత్రాల్లో సంప్రదాయబద్ధ నటనను ప్రదర్శించి మెప్పించగల సత్తా ఆమెలో ఉంది. చిన్న గ్యాప్ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసిన ఈ గుజరాతీ బ్యూటీ ప్రస్తుతం ఆర్య సరసన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంలో కార్తీతో మూడవసారి ముచ్చటగా డ్యూయెట్స్ పాడుతున్నారు. ఈ చిత్రంలో మరో హీరోగా టాలీవుడ్ నటుడు నాగార్జున నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ వైదొలగిన పాత్రలో తమన్న నటిస్తున్నారన్నది గమనార్హం. ఈ రెండు చిత్రాల్లో కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టాలని ఆశపడుతున్న తమన్న తనకు నంబర్‌వన్ స్థానంపై నమ్మకం లేదంటున్నారు. ఆమె మాట్లాడుతూ తన భాషలో నటించినా ఆ భాష నేర్చుకోవాలని ఆశిస్తానన్నారు. నిజం చెప్పాలంటే అందాలారబోయాలన్నది తన అభిమతం కాదన్నారు. దర్శకుల ఆకాంక్షలు మేరకు అలా నటిస్తున్నానని అన్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే గ్లామర్‌ను పక్కన పెట్టి నటించడానికి తాను సిద్ధం అన్నారు. ఇక నంబర్‌వన్ స్థానం ఇప్పుడు వారానికొకరిదిగా మారిపోతోంది. అలాంటి దానిపై తనకు నమ్మకం లేదని తమన్న స్పష్టం చేశారు. -
కార్తీతో నయనతార
కార్తీ, నయనతారల క్రేజీ కాంబినేషన్లో ఒక విభిన్న భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కార్తీ, తమన్న, కాజల్ అగర్వాల్, ప్రణీత, ప్రియమణి, ఆండ్రియ తదితర హీరోయిన్లతో నటించినా ఇంతవరకు సంచలన తార నయనతారతో నటించలేదు. అయితే ఇప్పుడు అలాంటి సమయం ఆసన్నమైంది. కొంభన్ చిత్ర విజయానందంలో వున్న కార్తీ ప్రస్తుతం నాగార్జునతో కలసి తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన తమన్న నటించనున్నారని సమాచారం. ఇప్పటికే పైయ్యా, చిరుతై చిత్రాలలో కార్తీతో జత కట్టిన తమన్న ముచ్చటగా మూడోసారి ఆయనతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కార్తీ నటించే మరో చిత్రం కాషోమరా ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఒక హీరోయిన్గా నయనతార, రెండవ హీరోయిన్గా శ్రీ దివ్య నటించనున్నారు. దీనికి గాను ఇదర్కుదానే ఆశైపటాయ్ బాలకుమార చిత్రం ఫేమ్ గోకుల్ దర్శకత్వం వహించనున్నారు. మే నెల తొలి వారంలో చిత్రం సెట్‌పైకి రానుందని సమాచారం. నయనతార ఫైయ్యా చిత్రంతోనే కార్తీకి జంటగా నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వలన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. మళ్లీ ఇప్పటికి వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ సూర్యతో మాస్, జయంరవి సరసన తనీ ఒరువన్, విజయ్‌సేతుపతికి జంటగా నానుం రౌడీదాన్ చిత్రాలతో పాటు మాయ అనే హార్రర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. శింబు సరసన నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అదే విధంగా త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్తోను జోడి కట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. -
మణిరత్నం డెరైక్షన్‌లో ధనుష్ చిత్రం
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, నటుడు ధనుష్ కలయికలో ఒక వైవిధ్యభరిత చిత్రం తెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. కడల్ చిత్రం తరువాత మణిరత్నం తమిళం, తెలుగు భాషల్లో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం చేయాలని భావించారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌లు జంట ఓకే కన్మణి అనే విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని సమాచారం. తదుపరి నటుడు ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. బాలీవుడ్ చిత్రం షమితాబ్‌ను తమిళ చిత్రం అనేగన్ను పూర్తి చేసిన ధనుష్ ప్రస్తుతం మారి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజి మోహన్ దర్శకుడు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు ధనుష్ ప్రకటించారు. ఆ తరువాత ఈ యువ నటుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. -
నాకా భయం లేదు!
‘దబాంగ్’లాంటి మెగా హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా... ఆ తరువాత చెప్పుకో తగ్గ ఆఫర్లు లేవనే చెప్పాలి సోనాక్షి సిన్హాకు. అందుకే రూటు మార్చి ఇద్దరు ముగ్గురు ఫిమేల్ స్టార్స్ ఉన్న సినిమాల్లో కూడా చేస్తోందని బీ టౌన్లో గుసగుస. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడిగితే... ‘మల్టీ స్టారర్ సినిమాలో చేయడం ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నా. ఇప్పటికే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. కెరీర్ గురించి నాకెలాంటి అభద్రతా భావం లేదు. అజయ్‌దేవ్‌గణ్‌తో చేస్తున్న యాక్షన్ జాక్సన్లో రోల్ నచ్చింది. సో... హీరోయిన్లు ఎంతమంది ఉన్నారన్నది సమస్య కాదు’ అంది సోనాక్షి. -
ముచ్చటగా మూడో మల్టీస్టారర్
త్వరలో ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో సమంత నటించబోతున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్టిట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఒక గ్రేట్ మల్టీస్టారర్‌లో నటించే అవకాశం తలుపుతట్టింది. పైగా ఆ కథ నాకు విపరీతంగా నచ్చేసింది. అయితే.. ఆ సినిమాకు అధికారికంగా ‘ఓకే’ చెప్పలేదు. అన్నీ కుదిరితే... ఆ సినిమాకు పచ్చజెండా ఊపేస్తాను. ఆ తర్వాత మిగిలిన వివరాలు చెబుతా’’ అని సమంత ట్వీట్ చేశారు. ఇంతకీ సమంతకు అంతగా నచ్చిన ఆ మల్టీస్టారర్... తెలుగు చిత్రమా? లేక తమిళ చిత్రమా అనేది ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో, అటు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా... సమంతకు మల్టీస్టారర్లు మాత్రం బాగా కలిసొచ్చాయి. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంత కథానాయిక. ఈ మధ్య... విడుదలైన అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’లో కూడా సమంతే కథానాయిక. అంటే త్వరలో ‘ఓకే’ చేయబోయే ఈ సినిమా ముచ్చటగా సమంత నటించబోయే మూడో మల్టీస్టారర్ అన్నమాట. ఇంతకీ ఆ మల్టీస్టారర్ ఏంటి? నాగార్జున, ఎన్టీఆర్‌లతో పైడిపల్లి వంశీ చేయబోయే సినిమానా? లేక... మీడియాలో హల్చల్ చేస్తున్న వెంకటేశ్, రవితేజాల సినిమానా? లేక తమిళంలో ఏదైనా సినిమానా? దానికి సమాధానం సమంతే చెప్పాలి.