కార్తీతో నయనతార
కార్తీ, నయనతారల క్రేజీ కాంబినేషన్‌లో ఒక విభిన్న భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కార్తీ, తమన్న, కాజల్ అగర్వాల్, ప్రణీత, ప్రియమణి, ఆండ్రియ తదితర హీరోయిన్లతో నటించినా ఇంతవరకు సంచలన తార నయనతారతో నటించలేదు. అయితే ఇప్పుడు అలాంటి సమయం ఆసన్నమైంది. కొంభన్ చిత్ర విజయానందంలో వున్న కార్తీ ప్రస్తుతం నాగార్జునతో కలసి తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆయన సరసన తమన్న నటించనున్నారని సమాచారం. ఇప్పటికే పైయ్యా, చిరుతై చిత్రాలలో కార్తీతో జత కట్టిన తమన్న ముచ్చటగా మూడోసారి ఆయనతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కార్తీ నటించే మరో చిత్రం కాషోమరా ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఒక హీరోయిన్‌గా నయనతార, రెండవ హీరోయిన్‌గా శ్రీ దివ్య నటించనున్నారు. దీనికి గాను ఇదర్కుదానే ఆశైపటాయ్ బాలకుమార చిత్రం ఫేమ్ గోకుల్ దర్శకత్వం వహించనున్నారు. మే నెల తొలి వారంలో చిత్రం సెట్‌పైకి రానుందని సమాచారం. నయనతార ఫైయ్యా చిత్రంతోనే కార్తీకి జంటగా నటించాల్సి ఉంది.
కొన్ని కారణాల వలన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. మళ్లీ ఇప్పటికి వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ సూర్యతో మాస్, జయంరవి సరసన తనీ ఒరువన్, విజయ్‌సేతుపతికి జంటగా నానుం రౌడీదాన్ చిత్రాలతో పాటు మాయ అనే హార్రర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. శింబు సరసన నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అదే విధంగా త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్‌తోను జోడి కట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.