రత్నమహాదేవిగా నయన్
తమిళ హీరో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా కాష్మోరా. కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పొస్డ్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన కార్తీ లుక్స్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న నయనతార్ లుక్ను రివీల్ చేశారు.
గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార రత్నమహాదేవిగా నటిస్తోంది. రాణి వేషదారణలో రౌధ్రంగా కనిపిస్తున్న నయన్ లుక్స్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. శ్రీదివ్య మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు, ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.