అదృష్టవశాత్తూ ఈ ఏడాది ఎంతగానో కలిసివచ్చిందంటూ సంతోషం పట్టలేకపోతుందీ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ. 2019 తనకు ఎంతో ఇచ్చిందంటూ ఈ ఏడాదికి సంతోషంగా గుడ్‌బై చెప్తోంది. ఆమె తాజాగా నటించిందిన ‘దబాంగ్ 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీనికన్నా ముందు సోనాక్షి నటించిన కళంక్, ఖాందానీ, శఫఖానా, మిషన్ మంగళ్’ విడుదలయ్యాయి. అయితే వీటన్నింటిలోనూ భిన్న రకాల పాత్రలు చేసానని సోనాక్షి చెప్పుకొచ్చింది. అయితే దబాంగ్‌లో చుల్‌బుల్‌పాండే(సల్మాన్ ఖాన్) భార్య రాజో పాత్ర తనకు ఎంతో ఇష్టమైన పాత్రగా అభివర్ణించింది.
తొలిపాత్రతోనే గుర్తింపు తెచ్చుకుకోవడం మరిచిపోలేనని పేర్కొంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి చెప్తూ అతను సినిమా కోసం ఎంతగానో కష్టపడతాడని పేర్కొంది. ముఖ్యంగా సల్మాన్ దగ్గర నుంచి చేసే పని పట్ల అంకితభావాన్ని కల్గి ఉండటాన్ని నేర్చుకున్నానంది. తాను నటన కోసం ప్రత్యేకంగా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేన, షూటింగ్ సమయంలోనే నటనలో మెళకువలు నేర్చుకున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం సోనాక్షి సిన్హ యాక్షన్ మూవీ ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో అజయ్ దేవ్‌గన్‌తో జోడీ కడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment