
తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి సెలబ్రిటీలు నిత్యం వర్కవుట్లు చేస్తూ ఉంటారు. ఏమాత్రం బొద్దుగా తయారైనా ఆఫర్లు అందుకోవడం గగనమే అవుతుంది. కొందరైతే బరువు తగ్గడానికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి షార్ట్‌కట్లు కూడా వెతుకుతారు. ఎందుకంటే వాళ్లకు నచ్చినట్లుగా ఉంటే ఆఫర్లు రావడం అంత ఈజీ కాదు. తన విషయంలోనూ ఓసారి ఇదే జరిగిందంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ (Sonakshi Sinha). తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ఓసారి ఏమైందంటే నేను లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.
అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చా..
అప్పుడు నా మనసు ముక్కలైంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. కాస్త లావయ్యానని కథానాయిక పాత్రకు నన్ను తిరస్కరించారు. ఆ పాత్రలో నేను బాగోనని, కావాలంటే ఏదైనా చిన్నాచితకా పాత్రలు చేసుకోమని సలహా ఇచ్చారు. నాకు చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్లేసరికి మా అత్త అక్కడే ఉంది. దేవుడు నన్నెందుకిలా పుట్టించాడు? నాకెందుకిలా చేస్తున్నాడు? అంటూ నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చాను. బాధపోయేవరకు ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజే మళ్లీ మామూలు మనిషయ్యాను అని చెప్పుకొచ్చింది.
సినిమా
సోనాక్షి చివరగా కకుడా (Kakuda Movie) అనే హారర్ చిత్రంలో కనిపించింది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన హీరామండి: ద డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ప్రస్తుతం హీరామండి రెండో సీజన్‌లో యాక్ట్ చేస్తోంది. గతేడాది సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది.
చదవండి: ఓటీటీలో 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్.. అలాంటి కంటెంట్ కావడంతో..
Comments
Please login to add a commentAdd a comment