కోహ్లి మైనపు విగ్రహం
న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ నిర్వాహకులు బుధవారం ఆవిష్కరించారు. దీంతో ఇప్పటికే ఈ మ్యూజియంలో కొలువైన టీమిండియా దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌ల సరసన తాజాగా కోహ్లి చేరాడు. ఈ సందర్భంగా కోహ్లి మేడమ్ టుస్సాడ్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
‘‘నా మైనపు విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కష్టపడ్డ మీకు మనస్పూర్తిగా నా అభినందనలు. నాకు జీవితాంతం గుర్తుండే అనుభూతినిచ్చిన మేడమ్ టుస్సాడ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నా జీవితంలో మరిచిపోలేని విషయం ఇది. ప్రస్తుతం అభిమానుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా.’’ అని కోహ్లి పేర్కొన్నట్లు మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కోహ్లి ఆటతీరుకు ఫిదా అయిన ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ నిర్వాహకులు గత నెల 200 కొలతలు తీసుకుని ఢిల్లీ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఆవిష్కరించారు. తనతో సెల్ఫీలు దిగేవారు ఢిల్లీకి రావాలని కోహ్లి మంగళవారం ట్విటర్‌లో స్పందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment