
రొనాల్డోకి ఇండియన్ హెయిర్
ఫుట్బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తన మైనపు బొమ్మ తయారు చేయడానికి 20 లక్షలు ఖర్చు చేశాడు. అంతే కాదండోయ్ దీనికోసం అసలైన జుట్టును భారత్ నుంచి తెప్పించినట్లు సమాచారం. తన సొంత హెయిర్ స్టెయిలిస్ట్తో దానికి సొబగులద్దిస్తున్నాడట ఈ పోర్చుగీస్ కెప్టెన్. మైనపు విగ్రహం అచ్చు తనలాగే ఉండేందుకు జాగ్రత్తపడుతున్నాడట.
స్పెయిన్లోని వ్యాక్స్ మ్యూజియంలోని తన విగ్రహానికి యథాతథంగా కాపీ చేయించాడట. బ్రిటిష్ మైనపుశిల్పి మైఖేల్కు తన విగ్రహం తయారీ బాధ్యతలు అప్పగించాడు. విగ్రహం తయారీ వివరాలు మీడియాతో పంచుకున్న మైఖేల్ ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. విగ్రహానికి రోనాల్డో లేటెస్ట్ ఫుట్బాల్ కిట్ను అమర్చడంతో పాటు. సరికొత్త షూ ఉపయోగిస్తున్నట్లు వివరించాడు. ఇక హెయిర్ స్టెయిల్ విషయంలో రొనాల్డో ఏమాత్రం రాజీ పడలేదట. రోనాల్డో కోరిక మేరకు భారత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన జుట్టును మైనపు విగ్రహానికి అమర్చి.. తర్వాత తన సొంత హెయిర్ డ్రెస్సర్తో స్టయిలింగ్ చేయించాడట. ఈ విగ్రహాన్ని రొనాల్డో భవనంలో ఏర్పాటుచేసే ముందు యూరోప్లోని ప్రధాన నగరాల్లో ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అంతే కాదండోయ్.. మాడ్రిడ్లోని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటుచేసిన మైనపు విగ్రహం పట్ల కూడా రొనాల్డో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాడట. 2013 నుంచి వ్యాక్స్ మ్యూజియంలో ఉన్న రొనాల్డో విగ్రహం బాగోగులు చూసేందుకు ఆయన ప్రతి నెలా నిపుణులను పంపిస్తాడట. ఈ నిపుణులు ప్రత్యేకంగా రొనాల్డో విగ్రహం హెయిర్ స్టెయిల్ పట్ల జాగ్రత్త వహిస్తారని మ్యూజియం కమ్యూనికేషన్ డైరెక్టర్ తెలిపారు.