
కరీనాకపూర్ మైనపుబొమ్మకు రా.వన్ చీర
లండన్: మేడమ్ టుస్సాడ్స్‌లోని తన మైనపుబొమ్మకు కరీనా సరికొత్త రూపు ఇవ్వనుంది. ఇందులోభాగంగా రా.వన్ సినిమా కోసం తాను ధరించిన ‘చమ్మక్ చల్లో’ ఎర్ర చీరను ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ బొమ్మకు నలుపురంగు టాప్, హరేం ప్యాంట్ ఉంది. ఈ డ్రస్సు ‘జబ్ ఉయ్ మెట్’ సినిమాలోని ‘మౌజారే మౌజా’ పాట సమయంలో ధరించినది.
భర్త సైఫ్ అలీఖాన్ 44వ పుట్టినరోజు వేడుకల కోసం నగరానికి వచ్చిన కరీనా మేడమ్ టుస్సాడ్స్‌లోని తన మైనపు ప్రతిమ పక్కన నిలబడి ఓ ఫొటోకి నపోజిచ్చింది. ఆ తర్వాత తాను తీసుకొచ్చిన కొత్త చీరను నిర్వాహకులకు కరీనా అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చీర ఎంతో అందంగా ఉందంది. మైనపుబొమ్మ కన్నులు అచ్చం తనవిలాగే అనిపిస్తున్నాయని మేడమ్ టుస్సాడ్స్‌కు చెందిన వెబ్‌సైట్‌లో మంగళవారం పేర్కొంది. ‘మేడమ్ టుస్సాడ్స్‌లోని నా మైనపుబొమ్మను నా అభిమానులు వినూత్నంగా చూడాలనేది నా ఆకాంక్ష.
అందువల్లనే రా.వన్‌లో ఉపయోగించిన ఎర్ర చీరను ఇక్కడికి తీసుకొచ్చా. ఈ క్షణం నా జీవితంలో ఓ మరపురాని ఘట్టం’అని పేర్కొంది. ఈ విగ్రహం బాలీవుడ్‌నంతటినీ ఎంతగానో ఆకట్టుకుంటుందంది. ఇదో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుందంది. కాగా ఈ మైనపు ప్రతిమ రూపకల్పనకుఏ 1,50,000 పౌండ్లు ఖర్చయ్యాయి. అంతేకాకుండా దీనిని తీర్చిదిద్దేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. ఇదిలాఉంచితే కరీనాకపూర్‌తోపాటు అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ఖాన్, ఐశ్వర్యరాయ్, హృతిక్ రోషన్‌లకు కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు ప్రతిమలు ఉన్నాయి. బాలీవుడ్‌కు చెందిన మరొకరి మైనపు ప్రతిమను వచ్చే ఏడాది ఏర్పాటు చేయనున్నారు.