సినీ ఇండస్ట్రీలో సింగర్లకు ప్రత్యేకస్థానం ఉంటుంది. రచయిత రాసిన పాటను మధురమైన స్వరాలను అందించండం వారికి మాత్రమే సొంతం. అలా సినీరంగంలో ఎంతోమంది ప్రముఖ గాయకులు ఉన్నారు. చిన్న వయస్సులోనే విజయం సాధించి ఈ రంగంలో కీర్తిని పొందినవారిని ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. తమ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను మైమరపించిన ఎందరో తారలు ఈ కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటివారిలో ముఖ్యంగా దివ్యభారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరిలాగే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్వర్ణలత సైతం చిన్న వయసులోనే మరణించారు. ఈ స్టోరీలో ఆమె గురించి తెలుసుకుందాం.
(ఇది చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ)
స్వర్ణలత.. ఈ పేరు హిందీతో పాటు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో సుపరిచితం. 1973లో కేరళలో జన్మించిన ఆమె సెప్టెంబర్ 12, 2010న ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె తన కెరీర్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీతో సహా దాదాపు 10 భాషలలో ఏకంగా పదివేల పాటలకు పైగా ఆలపించింది.
ముఖ్యంగా స్వర్ణలత దక్షిణాది చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ.. ఆమె హిందీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నీతిక్కు తందానైలో కేజే యేసుదాస్‌తో కలిసి 'చిన్నచిరు కిలియే' అనే పాట పాడిన తర్వాత స్వర్ణలత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో విజయం సాధించింది. కరుత్తమ్మ చిత్రంలోని "పోరాలే పొన్నుతాయి" పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఆయన సంగీతంలో జాతీయ అవార్డును అందుకున్న మొదటి మహిళా నేపథ్య గాయని కూడా స్వర్ణలతనే.
స్వర్ణలత తన ఫేవరెట్ సింగర్ అని గతంలోనే ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో చెప్పారు. కేరళలోనే పుట్టి పెరిగిన ఆమె 37 సంవత్సరాల వయసులో చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించారు.
(ఇది చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment