
న్యూఢిల్లీ: భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ అవార్డులను (National Awards) ఇవ్వడం ఆనవాయితి. ఈ ఏడాది కూడా 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఈ పురస్కారాలను దక్కించుకున్నాయి.
సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం 'సూరయై పొట్రు' తెలుగులో ఆకాశం నీ హద్దురా' సినిమాకు అవార్డుల పంట పండింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడు( జీవీ. ప్రకాష్ కుమార్), ఉత్తమ స్క్రీన్‌ప్లే (సుధా కొంగర, షాలిని ఉషాదేవి) అవార్డులను దక్కించుకున్నారు.
చదవండి: Rakhi Sawant: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్ ఇవ్వండి