Aakasam Nee Haddura
-
ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్ సినిమా 'సర్ఫిరా'
అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్‌గా సర్ఫిరా బాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇందులో రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటించారు. బాక్సాఫీస్ వద్ద 'సర్ఫిరా' చిత్రానికి నిరాశే మిగిలింది. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల అవుతుంది.సర్ఫిరా చిత్రాన్ని ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు 'సర్ఫిరా' సినిమా వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి 'సర్ఫిరా' స్ట్రీమింగ్ అవుతుందని అక్షయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని సర్ఫిరా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, ఇదే సినిమాకు మాతృక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మాత్రం ఓటీటీలో భారీ విజయం సాధించింది.Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw— Akshay Kumar (@akshaykumar) September 26, 2024 -
సూర్య హిట్ సినిమా అక్షయ్ కుమార్ రీమేక్.. ట్రైలర్ విడుదల
సౌత్ ఇండియా స్టార్ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు 'సర్ఫిరా' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.సూర్య నిర్మాతగా 2020లో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా సర్ఫిరా చిత్రానికి కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా ఉంటే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్ చూస్తూంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తోంది. జులై 12 ఈ చిత్రం విడుదల కానుంది. -
సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’తో ఫుల్ బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో కీలక పాత్రలో మెరవనుంది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) సూర్య బర్త్‌డే జులై 23న ఘనంగ జరగనుంది. అందులో భాగంగానే కంగువ సినిమా తొలి గ్లింప్స్‌ను జులై 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్య పుట్టినరోజు నాడే అభిమానులకు మరో శుభవార్త ఆయన చెప్పనున్నారు. తన తదుపరి చిత్రం వివరాలు ప్రకటించనున్నారు. దానిని ఒక లేడీ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'సూరారై పోట్రు' (ఆకాశమే నీ హద్దురా) చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగరనే సూర్య 43 సినిమాకు దర్శకురాలు కానుందని టాక్. తను తెలుగులో కూడా వెంకటేశ్‌తో 'గురు' సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. సుధ కొంగర పుట్టింది విశాఖలో అయినా ఆమె చెన్నైలో స్థిరపడింది. సినిమా గురించి సుధ ఏం చెప్పిందంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుధ ఇలా చెప్పింది. ఆకాశమే నీ హద్దురా సినిమా కంటే సూర్యతో భారీ బడ్జెట్లో సినిమా తీయబోతున్నట్లు చెప్పింది. ఆ కథకు భారీగా ఖర్చు అవుంతుందని, అందుకు కొంచెం భయం కూడా ఉందని చెప్పుకొచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా తీస్తున్నా బయోపిక్ మాత్రం కాదని పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఇవ్వనున్నారు. సుధ కొంగరకు సూర్య మరో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) -
సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట
న్యూఢిల్లీ: భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ అవార్డులను (National Awards) ఇవ్వడం ఆనవాయితి. ఈ ఏడాది కూడా 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఈ పురస్కారాలను దక్కించుకున్నాయి. సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం 'సూరయై పొట్రు' తెలుగులో ఆకాశం నీ హద్దురా' సినిమాకు అవార్డుల పంట పండింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అదే సినిమాలో హీరోయిన్గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడు( జీవీ. ప్రకాష్ కుమార్), ఉత్తమ స్క్రీన్‌ప్లే (సుధా కొంగర, షాలిని ఉషాదేవి) అవార్డులను దక్కించుకున్నారు. చదవండి: Rakhi Sawant: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్ ఇవ్వండి