తమిళసినిమా: నటుడు సూర్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం జై భీమ్. ఆయన తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. 1993 ప్రాంతంలో విల్లుపురం సమీపంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహింన ఇందులో గిరిజనుల రక్షణ కోసం పోరాడిన న్యాయమూర్తి చంద్రు పాత్రలో సూర్య నటించారు.
గిరిజనుల కోసం సర్య చేసిన న్యాయపోరాటమే జై భీమ్ చిత్రం. ఈ చిత్రం గత ఏడాది దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు జై భీమ్ చిత్రం అకాడమీ అవార్డును గెలుచుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి సూర్యను ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ఈ చిత్రోత్సవంలో పాల్గొన్న దర్శకుడు జ్ఞానవేల్ జై భీమ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న మీడియా ప్రశ్నకు న్యాయమూర్తి చంద్రు వాదించిన అనేక కేసులు ఉన్నాయన్నారు. వాటిలో ఏదో ఒక అంశంతో జై భీమ్‌కు సీక్వెల్‌ను కచ్చితంగా చేస్తామని అందులోనూ సూర్య నటిస్తారని బదులిచ్చారు. ఇదే విషయాన్ని నిర్మాత రాజశేఖర్ సైతం ద్రువీకరించారు. దీంతో కాస్త ఆలస్యంగానైనా జై భీమ్‌కు సీక్వెల్‌ను ఎదురు చూడవచ్చన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment